రామ్ గోపాల్ వర్మ...రెండు వందల కోట్ల కథ
ఎప్పుడూ ఏదో ఒక సంచలనంగా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా అమ్మ అనే త్రీడీ చిత్రాన్ని హఠాత్తుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నిర్మాతలు లేరని, ఆ నిర్మాతలను పట్టడానికే ఈ ప్రకటన విడుదల చేసాడని తెలుస్తోంది. రక్త చరిత్ర వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చాక కూడా వర్మకి నిర్మాతలు లేకపోవటమేమిటని అన్పించవచ్చు కానీ ఈ అమ్మ చిత్రానికి నిర్మాతలు దొరకటం కష్టమేనంటున్నారు. కారణం ఈ చిత్రం బడ్జెట్టు దాదాపు రెండు వందల కోట్లు అని తెలుస్తోంది. ఏ నిర్మాత అయినా ఒక్క సినిమాపై అంత బడ్జెట్ ఎందుకు పెడతారని అంతా ప్రశ్నిస్తున్నారు. ఇక అమ్మ చిత్రం ఓ ట్రెజర్ హంట్ చిత్రమని, ఇందులో హీరోలు ఉండరని అందరూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలే ఉంటారని వర్మ మరో ట్విస్టు ఇస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, నసీరుద్దీన్ షా, అర్జున్, జాయేద్ ఖాన్, అభిమన్యుసింగ్, సోనూసూద్, సుబ్బరాజు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తారు.


Click it and Unblock the Notifications











