తక్కువ బడ్జెట్ లో మరో ఐస్ క్రీమ్ ప్లాన్ చేస్తు RGV.. ఈసారి మరింత వేడిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగలతో నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్ లో జాగ్రత్తగా ఉంటూ వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తాడు. ఇక ఆ ఆయన హిట్ టాక్ ను సొంతం చేసుకొని చాలా కాలం అయ్యింది. అయితే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వర్మ సినిమాలను చేయడం ఏ మాత్రం ఆపడం లేదు.

తనకు నచ్చిన కథలను కాన్సెప్ట్ లను వెండితెరపైకి తీసుకు వస్తూనే మరోవైపు వెబ్ కంటెంట్ పై కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ఇక చాలా కాలం అనంతరం వర్మ మరో ఐస్ క్రీమ్ ను సెట్స్ పైకి దింపబోతున్నట్లు సమాచారం. 2014లో నవదీప్, తేజస్విని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక మరికొందరి చేత ఆ సినిమా విమర్శలు కూడా అందుకుంది. అయినప్పటికీ వర్మ మరో సీక్వెల్ ను రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు.

ram gopal varma another ice cream movie after long time

ఇక అలాంటి కాన్సెప్ట్ తోనే ఐస్ క్రీమ్ 3 అంటూ మరో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక వర్మ చేతిలో ప్రస్తుతం విడుదలకు సిద్ధం కావాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాగే మరికొన్ని వెబ్ సీరీస్ లు కూడా ఉన్నాయి. ఇక వర్మ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంటర్వ్యూలకు గ్యాప్ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఐస్ క్రీమ్ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయాలని వర్మ ఒక ప్రముఖ నిర్మాతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంద.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X