వర్మ మెడలు వంచిన నాగార్జున
పొగరుబోతు తనం ప్రదర్శిస్తుంటాడని దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనేక విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే వర్మ ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడు. ఏమైనా కానీ... తను చేయాలనుకున్నదే చేసే మొండి ఘటం. తను రూపొందిస్తున్న 'బెజవాడవాడ రౌడీలు" సినిమాకు సంబంధించిన టైటిల్ వివాదంలో వర్మ ప్రవర్తనే ఇందుకు నిరద్శనం. బెజవాడ మొత్తం రోడ్డెక్కి వర్మను ఛీ కొట్టినా ఆయన వినలేదు. ఆరు నూరైనా..నూరు నూటయాబై అయినా టైటిల్ మార్చేప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అయితే ఉన్నట్టుండి వర్మ మనసు మార్చకున్నాడు. రౌడీలు అనే పదాన్ని తొలగించి 'బెజవాడ" మార్చాడు.
వర్మలో సడన్ గా ఈ మార్పు ఏమిటి? అని అంతా ఆశ్చర్య పోయాడు. ఇదే విషయాన్ని వర్మను అడిగితే...'కొన్ని కారణాల వల్ల బెజవాడ రౌడీలు పేరు బెజవాడగా మార్చా, కారణం ఏమిటని మీరు ఎన్ని విధాలుగా ఊహించుకున్నా అసలు కారణం నాకు ఒక్కడికే తెలుసు" అని సమాధానం ఇచ్చాడు.
అసలు విషయం ఏమిటని ఆరాతీస్తే..మొండి ఘటం మెడలు వంచింది నాగార్జునే అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. తన తనయుడు నాగచైనత్య నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై నాగ్ బాగా కేర్ తీసుకుంటున్నాడని, చైతూ నటించిన దడ సినిమా ఇప్పటికే ప్లాపు అయిన నేపథ్యంలో బెజవాడరౌడీలు సినిమాపై ఎలాంటి వివాదాలు ఉండకూడదని, ఉంటే అవి నాగార్జున సినీ కెరీర్ పై ప్రభావం చూపుతాయనేది నాగార్జున ఆలోచన. దీంతో వర్మపై ఒత్తిడి తెచ్చి టైటిల్ మార్పించాడు. నాగార్జున అంతటి వాడు చెప్పడంతో వర్మ మొట్టు దిగక తప్పలేదు.


Click it and Unblock the Notifications











