వర్మ 'బెజవాడ రౌడీలు' ఆ సినిమా కాపీలా ఉంటుందా!?
నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ నుంచీ సంచలనం క్రియేట్ చేయాలని తపన పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై చిత్రం ప్రేరణతో ఎనభైల్లో విజయవాడలో జరిగిన రౌడీయిజం నేపధ్యంలో కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై తరహాలోనే ఆ కాలం నాటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే తమిళంలో వచ్చి విజయవంతమైన సుబ్రమణ్యపురం(తెలుగులో అనంతపురం) చిత్రంలో లోగ నేరేషన్ స్లోగా నడుస్తుందని చెప్తున్నారు. రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో ఫిక్షన్ ని జోడించి అల్లుకున్న ఈ కథను రక్త చరిత్రలా క్రేజ్ తేవాలని వర్మ గట్టిగా ప్రయత్నిస్తున్నారని, ఆయన తన మార్కెటింగ్ స్కిల్స్ మొత్తం చిత్రం కోసం వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఎంత హిందీ, తమిళ చిత్రాలు ప్రేరణతో ఈ చిత్రం వచ్చినా ఖచ్చితంగా సినిమా మాత్రం వర్మ గతంలో గాడ్ ఫాధర్ ప్రేరణతో తీసిన గాయం, సర్కార్ లకు కాపీలా ఉంటుందని సినీ పరిశ్రమలో వినపడుతోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











