రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానా?
హైదరాబాద్: వివాదాస్పద, సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన త్వరలో హీరో రానాతో సినిమా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘గొలుసు' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. గతంలో రానా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘డిపార్ట్ మెంట్' అనే హిందీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలో ‘గొలుసు' చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘శ్రీదేవి' చిత్రం వివాదంలో ఉన్నసంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ తన తాజా సినిమాకు ‘శ్రీదేవి' పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హీరోయిన్ శ్రీదేవి లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై వర్మ స్పందించారు. తాను తీస్తున్న ‘శ్రీదేవి' సినిమాకు, నటి శ్రీదేవికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అనవసర రాద్దాంతం అవసరం లేదన్నారు. 15 ఏళ్ల టీనేజీ కుర్రాడు 25 ఏళ్ల మహిళపై ఎలా వ్యామోహం పెంచుకున్నాడనేదే సినిమా కథాంశం, హీరోయిన్ శ్రీదేవి జీవితానికి, తాను తీస్తున్న ‘శ్రీదేవి' సినిమా కథకు అసలు పోలికే ఉండదని వర్మ స్పష్టం చేసారు. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

దీంతో పాటు ఓ సెక్స్ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నాడు వర్మ. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి మధ్య ఎగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం. ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ......శృంగార చిత్రం మాత్రం తెరకెక్కించలేదు. 'XES' చిత్రం ద్వారా తన కెరీర్లో ఉన్న ఆ వెలితిని పూడ్చ బోతున్నారు వర్మ. కెరీర్లో తొలిసారి సెక్స్ ప్రధానమైన సినిమా చేస్తుండటంపై రామ్ గోపాల్ వర్మ ఎగ్జైట్మెంటుతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











