రామ్ గోపాల్ వర్మ నాగార్జునకు 'పెద్ద చెంచా'...!?
ఒకరికి అడుగులకు మడుగులొత్తినట్లు ఎవరి ప్రవర్తనైనా ఉంటే సదరు వ్యక్తిని చెంచాగాడని అందరూ అంటుంటారు. క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనకూ తానే ఒకప్పుడు టాలీవుడ్‌లో తానో చెంచాగాడిలా పనిచేశానంటూ పాత సంగతులను ఒక్కసారి నెమరేసుకున్నారు.
అది 1989 అక్టోబర్ 08 అనుకుంటాను, మా చెల్లి పుట్టినరోజు కోసం కొన్న గౌను పెద్దది అయితే, దాన్ని మార్చి నా పుట్టినరోజుకి డ్రెస్ కొందామని నాన్నగారు, అమ్మని, నన్ను కాకినాడ తీసుకెళ్ళారు. అప్పుడు షాపింగ్ ఐన తరువాత సినిమాకి వెళ్దాము అనినాన్నగారు అంటే నేను వెంటనే పక్కన గోడపైన ఉన్న హిందీ శివ పోస్టరు చూపించి దానికి వెళ్దాము అని చెప్పాను. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు. ఆ వయసులో మొత్తం హింది పోస్టరులో శివ అనే పేరుతో పాటు ఒక హ్యాండ్ చైన్ పట్టుకొని ఉండటం చూసి నచ్చి ఆ సినిమాకి వెళ్దాము అన్నాను. అప్పుడు ఆ సినిమా నాకు నచ్చింది కానీ అదే సినిమా తరువాత నా జీవితాన్నే మార్చేస్తుంది అని నాకు అప్పుడు తెలియదు.
'శివ" సినిమా తీయడానికి ముందు వర్మ బి.గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారట. అప్పట్లో నాగార్జున చిత్రం కలెక్టర్ గారి అబ్బాయి షూటింగ్ జరుగుతుంటే నాగ్‌ను ఇంప్రెస్ చేయడానికి రామ్‌గోపాల్ వర్మ శతవిధాలా ప్రయత్నించేవారట. వర్మ సిన్సియారిటీని చూసిన నాగార్జున కూడా ఆయన పట్ల సానుకూలంగా స్పందించేవారట. దీంతో వర్మను అందరూ 'నాగార్జున చెంచా" అని పిలిచేవారట.
కానీ ఆ చెంచా విమర్శలను పట్టించుకోని రామ్‌గోపాల్ వర్మ తను అనుకున్న ప్రాజెక్టు శివ తీసి నాగ్ చెంచా సత్తా ఏమిటో నిరూపించుకున్నారట. బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ సాధించిన శివ చిత్రం తర్వాత వర్మ ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితే ఎదురు కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్నది.


Click it and Unblock the Notifications











