ఆ దెబ్బకు వర్మ కు కూడా దడ పుట్టింది
రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా నాగచైతన్య హీరోగా 'బెజవాడ రౌడీలు'చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.తమ ప్రాజెక్టు విషయమై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న వర్మ రీసెంట్ గా విడుదలైన నాగచైతన్య దడ చిత్రం చూసి భయపడిపోయారట.కొత్త డైరక్టర్ అజయ్ భుయాన్ టేకింగ్ పేరుతో చేసిన విధ్వంసం చూసి తమ ప్రాజెక్టు పరిస్ధితి ఏమిటో తెలుసుకోవాలనుకున్నారుట.అందులోనూ నాగచైతన్య యాక్షన్ సన్నివేశాల్లో తేలిపోవటం ఆయన్ను బాగా వణికించింది.తమ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ చిత్రం,అందులోనూ కొత్త డైరక్టర్ తమ అవుట్ పుట్ ఎలా ఉంటుందనే భయంతో వెంటనే ఇప్పటివరకూ తీసిన ఫుటేజ్ తెప్పించుకుని చూడాలని నిర్ణయంచికుని పురమాయించారట.
అవసరమైతే రీషూట్ తప్పదని నాగచైతన్యకు కూడా చెప్పటం జరగిందన వినపుడుతోంది.మరో ప్రక్కన తన సినమాలు దొంగల ముఠా,అప్పలరాజు అంటూ వరసగా పోవటం,ఇప్పుడు నాగచైతన్య తో కూడా తేడా వస్తే చాలా ఇబ్బంది ఎదురవుతుందని భావించి జాగ్రత్త పడాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.విజయవాడ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం 'బెజవాడ రౌడీలు'. నాగచైతన్య హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో చైతన్య సరసన అమలాపాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె ఇటీవల విడుదలైన అనువాద చిత్రం 'నాన్న'లో నటించింది. 'బెజవాడ రౌడీలు' చిత్రం ద్వారా వివేక్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.దీనికి సంబంధించిన ముఖ్య సన్నివేశాల్నీ, యాక్షన్ ఘట్టాల్నీ ఇప్పటికే చిత్రించారు.


Click it and Unblock the Notifications











