రెడ్డి గారు పోయారు - వర్మకు మూడింది!

By Bojja Kumar

సినిమా రంగంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకు అనేక వివాదాస్పద అంశాలపై సినిమాలు రూపొందించి బెదిరింపులు సైతం ఎదుర్కొన్నాడు ఈ దర్శకుడు. అయినా సరే..వివాదాలే నాకు ఊపిరి అన్నట్లు తన దారిలో తాను వెలుతుంటాడు. తాజాగా వర్మ 'రెడ్డి గారు పోయారు' అనే టైటిల్ తో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇది మామూలు సినిమా అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు కానీ....దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ముడి పడి ఉండటం, వైయస్ మరణించిన అంశాన్ని, ఆయన మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, ఆయన చని పోయాక ఖాళీ అయిన సీఎం సీటు దక్కించుకోవడం కోసం జరిగిన పరిణామాలు, బయట పడ్డ కుంభ కోణాలు ఇలా అనేక విషయాలను తన సినిమాలో ప్రస్తావించనున్నాడు వర్మ. వైయస్ఆర్ పోయిన తర్వాతే ఇవన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి 'రెడ్డి గారు పోయారు' అనే టైటిల్ తగిలించడంతో ఈ సినిమా టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై వర్మ కు వార్నింగులు కూడా మొదలయ్యాయి. టైటిల్ మార్చుకోవాలని రెడ్డి కులస్థుల నుంచి ఇప్పటికే వార్నింగ్ కూడా వచ్చింది. మరో వైపు వర్మ తీయబోయే సినిమా వైయస్ఆర్ ను దేవుడిగా చూపెడుతుందా..? లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆయన్ను మరో కోణంలోచూపించబోతోందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. వైయస్ఆర్ కు అనుకూలంగా సినిమా ఉంటే ఫర్వాలేదు కానీ...వ్యతిరేకంగా ఉంటే వర్మకు మూడినట్లే అంటున్నారు వైయస్ఆర్ అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X