లగడపాటి పై రామ్ గోపాల్ వర్మ సినిమా?
ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉండాలని రాజగోపాల్ ప్రగాఢంగా నమ్ముతున్నారంటే దానిని నేను కూడా నమ్ముతున్నాను' అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజులు క్రిందట ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడాయిన ప్రస్తుత ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై చిత్రం చేయనున్నాడని వినపడుతోంది. సమైఖ్యాంద్ర నినాదంతో హైదరాబాద్ నిమ్స్ చేరి సంచలనం సృష్టించిన ఆయన గురించి వర్మ తన స్క్రిప్టు రైటర్స్ తో ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తన చుట్టూ జరిగే సంఘటనలు ఆధారంగా సంచలనం రేపే చిత్రాలను ప్లాన్ చేసే ఆయన తాజాగా రక్త చరిత్రను రూపొందిస్తున్నారు. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా దీనిని రూపొందిస్తున్నాడు. అలాగే లగడపాటి కథను ఆయన తెరకెక్కించినా ఆశ్చర్యం పోనక్కర్లేదని ఈ విషయం తెలిసిన సినీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే దీనికి లగడపాటే ఫండ్స్ ఏర్పాటు చేస్తారనే టాక్ కూడా వినపడుతోంది.
ఇక మొన్న లగడపాటి గురించి..నేను- లగడపాటి అని ఇచ్చిన ప్రకటనలో విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు జూనియర్ అయిన రాజగోపాల్ తో అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఒకసారి రాజగోపాల్ కాలేజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు ఎందుకు ఎన్నికల్లో దిగుతున్నావు అని అడిగితే..'ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదు, కానీ పదవి ఉన్నపుడు సమస్యల్లో ఉన్న ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండవచ్చు' అని లగడపాటి సమాధానం ఇచ్చారనీ, ఆయన ఇచ్చిన సమాధానం అందులో స్పష్టత చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లగడపాటిని టీవీలో చూశానని 25 ఏళ్ల నాటి రాజగోపాల్‌ను చూసినట్లుందని పేర్కొన్నారు. లగడపాటి కళ్లలో అదే నిజాయతీ, జిజ్ఞాస, ధైర్యం, ద్రుఢత్వం ఇప్పటికీ ఉన్నాయని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











