యాసిడ్ దాడులపై...రామ్ గోపాల్ వర్మ మూవీ?
ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం...రామ్ గోపాల్ వర్మ కంగన రనౌత్ సిస్టర్ రంగాలి జీవితంలో జరిగిన యాసిడ్ దాడి ఘటనపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని తెలుస్తోంది. ఇదే విషయమై కంగనా సిస్టర్ ను కాంటాక్టు చేస్తే ఆమె తీవ్రంగా స్పందించారు.
ఆమె మాటల ప్రకారం...'మా ఆమోదం లేకుండా తమపై సినిమా తీస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. అలాకాకుండా రామూజీ సినిమా తీస్తే కఠిన మైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆ సంగతి పక్కన పెడితే...వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ ఓ సినిమా రూపొందబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వివాదాలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టింది పేరు. అలాంటి రామ్ గోపాల్ వర్మ పేరుతో కాంట్రవర్సీగా చిత్రం రూపొందుతుందనే విషయం తెలియడంతో ఫిల్మ్ నగర్లో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
'డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' అనే చిత్రంలో వెన్నెల కిషోర్ నటిస్తున్నాడని, ఈ చిత్రం షూటింగ్ సైలెంట్‌గా, సీక్రెట్‌గా సాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన వారే ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












