లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం రగులుతున్న వేళ.. వైసిపి కీలక నేతతో వర్మ భేటీ!
ఓ వైపు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రూపొందిస్తుంటే దానికి పోటీగా వివాదాల వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో వస్తున్నాడు. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలయింది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో కలకలం సృష్టిస్తున్నాడు. ఇటీవల వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేయగా అది సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం వెనుక వైసిపి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో వర్మ కీలక వైసిపి నేతతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య
లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య నెలకొన్న బంధాన్ని తాను ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు వర్మప్రకటించాడు. కానీ ట్రైలర్ లో చాలా వివాదాస్ప అంశాలు ఉన్నాయి. కొంత మంది వర్మ కేవలం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని లక్ష్మీ పార్వతి కోణంలోనే తెరకెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు కూడా వర్మ సమాధానం ఇచ్చాడు. తాను తీసింది నిజమని నమ్ముతున్నానని, తనతో విభేదించేవాళ్ళు అసలు కథతో సినిమా తీయొచ్చని అన్నారు.

అందులో వాస్తవం లేదు
ఈ చిత్రం వెనుక వైసిపి హస్తం ఉందనే వార్తలని రాంగోపాల్ వర్మ ఖండించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మొత్తం లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులదే తప్పు అనే కోణంలో సన్నివేశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పై ఇప్పటికే బాలయ్య బయోపిక్ చిత్రాన్ని రూపొందించారు. దానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా వస్తోంది. దీనితో ఈ రెండు చిత్రాల గురించి సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వైసిపి కీలక నేతతో
రాంగోపాల్ వర్మ తాజాగా పార్క్ హయత్ హోటల్ లో వైసిపి కీలక నేత అంబటి రాంబాబుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర వివాదం రగులుతున్న వేళ వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ దాదాపు 30 నిమిషాల పాటు చర్చలు జరిపారట. వీరిద్దరి చర్చల సారాంశం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.
జగన్‌తో నిర్మాత
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి వైఎస్ జగన్ తో ఉన్న ఫోటోని ఇటీవల ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రాకేష్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు జగన్ కూడా ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న జగన్ ని ఉద్దేశిస్తూ కుడివైపున కూర్చున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదు అంటూ వర్మ సరదాగా వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications











