ప్రభాస్‌ను రాజకీయాల్లోకి లాగుతున్న రామ్ గోపాల్ వర్మ!
హైదరాబాద్: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మను గొప్ప దర్శకుడు అంటూ పొగిడిన వారు ఎందరో. కానీ ఇపుడు ఆయన్ను చాలా మంది చెత్త సినిమాల దర్శకుడు అంటూ విమర్శిస్తున్నారు. హిట్ బాటలో ఉన్నంత కాలం మంచి పేరు......ప్లాపుల బాటలో పడ్డాక చెత్తపేరు సినిమా ఇండస్ట్రీలో మామూలే అనుకోండి.
ఈ మధ్య అటు హిందీలోనూ....ఇటు తెలుగులోనూ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చి పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమాలు చేయాలంటేనే నిర్మాతలు భయ పడే పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ ఫిల్మ్ నగర్లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ ఓ పొలిటికల్ సెటైర్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని, ప్రభాస్ హీరోగా ఈ చిత్రాన్ని వర్మ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. వర్మ కెరీర్లోనే తొలి సారిగా అత్యధికంగా రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వర్మతో ఇంత పెద్దరిస్క్ చేసే నిర్మాత ఎవరు అనే సంగతి పక్కన పెడితే....ప్రభాస్ తన కెరీర్‌ను వర్మ చేతిలో పెట్టి రిస్క్ చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications












