మహేష్ కో పాదాభివందనం..ఆయనకో పాదాభివందనం: వర్మ
ఎప్పుడూ ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే డిఫెరెంట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పూరి జగన్నాథ్ ఏం మంత్రం వేశాడో కానీ ఇటీవల అతను ఏ సినిమా తీసినా కానీ వర్మకి అదో క్లాసిక్ లా కనిపింస్తోంది. నేను నా రాక్షసి, బుడ్డా సినిమాల గురించి పొగిడి పొగిడి వదిలిపెట్టిన వర్మ ఇప్పడు మహేష్ బిజినెస్ మ్యాన్ పై ప్రశంసలు గుప్పించడం అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో సీన్లు చూశానంటూ మహేష్ ని, పూరిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
దూకుడుకి డబుల్ ఉంటుందని ఇటీవలే చెప్పిన వర్మ ఇప్పుడీ చిత్రం చేస్తున్న మహేష్, పూరిలకి పాదాభివందనం చేయాలని అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది నిజమో..అపద్దమో..వెటకారమో తేల్చుకోలేని వర్మ క్యారెక్టర్ కి జడిసి, అసలు అతను ఈ సినిమా ఊసెత్తకుండా ఉంటే బాగుంటుందని మహేష్ అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా బిజినెస్‌మ్యాన్'గా టైటిల్ కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్ ఆర్ మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











