twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ నిజ స్వరూపం బయటపెట్టబోతున్న ఆర్జీవీ.. ‘పవర్ స్టార్’లో కాంట్రావర్సీ..

    |

    లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టిస్తున్న హంగామా మాములుగా లేదనే మాట వినిపిస్తున్నది. కంటెంట్ విషయం పక్కన పెడితే ఏదో ఒక మూవీని ప్రేక్షకుల మీదకు వదులుతూ.. స్థబ్దుగా ఉన్న సినీ పరిశ్రమకు సెన్సేషనల్ అంశాలతో జోష్‌ను పెంచుతున్నారు. సొంత ఓటీటీ ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో సినిమాలను రిలీజ్ చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా పవర్ స్టార్ సినిమా గురించి ప్రకటించి కొత్త వివాదాన్ని రేపారు. సినీ వర్గాల్లో ఆ సినిమా గురించి చర్చ జరుగుతున్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అవేమిటంటే..

    పవర్ స్టార్ టైటిల్‌తో మూవీ

    పవర్ స్టార్ టైటిల్‌తో మూవీ

    తాజాగా క్లైమాక్స్, నేకెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవి రానున్న రోజుల్లో కరోనావైరస్, థ్రిల్లర్, మర్డర్ చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా పవర్ స్టార్‌ మూవీని తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు. దాంతో పవన్ కల్యాణ్ గురించి ఏం చెప్పబోతున్నారనే విషయాలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

     పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయనున్నారా?

    పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయనున్నారా?

    రాంగోపాల్ వర్మ, మెగా ఫ్యామిలీల మధ్య కొంత విభేదాలు ఉన్నాయనే చర్చ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇటీవల వచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రను అభ్యంతరకరమైన రీతిలో చూపించారనే ఆరోపణలు వర్మపై వచ్చాయి. తాజాగా పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేయగానే పవన్‌ను మళ్లీ టార్గెట్ చేయబోతున్నారా? అనే ప్రశ్నలు సినీ వర్గాలు లేవనెత్తుతున్నారు.

    పవన్ కల్యాణ్‌కు అభిమానిని

    పవన్ కల్యాణ్‌కు అభిమానిని

    అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవర్‌స్టార్ సినిమాపై క్లారిటీ ఇస్తూ.. పవన్ కల్యాణ్‌ను నేను వీరాభిమానిని. ఆయన మంచిని కోరే శ్రేయోభిలాషిని. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీస్తుంటే వద్దని నేను ట్వీట్ కూడా చేశాను. ఆ సినిమా గురించి ముందే వేసిన నా అంచనాలు తప్పు కాలేదు. హిట్టు, ఫ్లాప్ అనేవి పక్కన పెడితే పవన్ కల్యాణ్‌కు మంచి జరిగాలని కోరుకొనే వారిలో నేను ఒకరిని అని చెప్పారు.

    పాజిటివ్ పాలిటిక్స్‌తో మూవీ

    పాజిటివ్ పాలిటిక్స్‌తో మూవీ

    ఇలా పపర్ స్టార్ సినిమా గురించి చర్చ జరుగుతుండగా.. ఆ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయం మీడియాలో చర్చ జరుగుతున్నది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పాజిటివ్ అంశాలను వర్మ ప్రస్తావించబోతున్నట్టు తెలిసింది. వ్యక్తిగత అంశాలతోపాటు రాజకీయ అంశాలను తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు స్క్రిప్టు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

    2014 ఎన్నికలు క్లైమాక్స్‌గా

    2014 ఎన్నికలు క్లైమాక్స్‌గా

    ఇక పవర్ స్టార్ సినిమాలో పాలిటిక్స్ అంశం హైలెట్ కాబోతున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2024 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే కథను సిద్ధం చేసుకొన్నట్టు తెలిసింది. వచ్చే ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారనే విషయాన్ని హైలెట్ అయ్యే విధంగా స్క్రిప్టును సిద్దం చేస్తున్నట్టు సమాచారం.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
     రియల్ స్టోరి కాదు.. ఫిక్షనల్ స్టోరీనే..

    రియల్ స్టోరి కాదు.. ఫిక్షనల్ స్టోరీనే..

    పవర్ స్టార్ చిత్రం అందరూ ఊహించిన విధంగా పవన్ కల్యాణ్ జీవితానికి సంబంధించిన సినిమా కాదు. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలతో రాసుకొన్న ఫిక్షనల్ స్టోరి. ఇందులో అతిగా వివాదాస్పద అంశాలు ప్రస్తావించడం లేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. పూర్తిగా ఇది పవన్ కల్యాణ్‌కు పాజిటివ్‌గా ఉండబోయే చిత్రంగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.

    English summary
    Director Ram Gopal Varma latest movie power Star is going to sets very soon. Reports suggest that, RGV is touching the subject in positive way rather than contraversy. RGV is going to show pawan Kalyan as King Maker in 2014 election in AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X