రామ్ గోపాల్ వర్మ ‘రామాయణం’
బాలయ్య శ్రీరామ రాజ్యం విడుదలై హిట్ టాక్ తో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను 'రామాయణం" సినిమాను తెరకెక్కిస్తానని, తన స్టయిల్ లో రామాయణం సినిమాను తీస్తానని శనివారం ప్రకటించాడు. తన రామయాణం సినిమా త్రేతా యుగం నాటిది కాదు, ఈ కాలం నాటిదే అని వర్మ చెప్పుకొచ్చారు. తన సినిమా స్టోరీలైన్ గురించి చెబుతూ....అయోధ్య గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్, లంక్ గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీకు మధ్య జరిగే బిజినెస్ వారే తన సినిమా ప్రధాన కథాంశమని చెప్పారు.
అయోధ్య గ్రూఫ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి ధశరథ్ రావు, ఆయన భార్య కౌసల్య. వీరి కొడుకు రాంశంకర్. దశరథ్‌కు ముంబైలో కైకేయి పరిచయం అవుతుంది. ఆమెను పెళ్లి చేసుకుని భరత్ కుమార్ అనే బిడ్డను కంటాడు. కంపెనీ ఎండీ బాధ్యతలు భరత్ కుమార్ కే అప్పగిస్తానని కైకేయికి మాటిస్తాడు. కానీ అన్నను కానదని తనకు ఎండీ బాధ్యతలు అప్పగించడం భరత్‌కు ఇష్టం ఉండదు. తండ్రి మాట మేరకు రామ్ శంకర్, లక్ష్మణ్ నాసిక్ బ్రాంచి పనులు చూసుకుంటారు. అక్కడ లంక గ్రూప్ ఆఫ్ కంపెనీ వీరితో పోటీకి వస్తుంది, మిగిలిన కథాంశం తన సినిమా విడుదలైన తర్వాత చూసి తెలుసుకోవాలని ట్విటస్ట్ ఇచ్చాడు వర్మ.
అయితే..వర్మ చేసిన ఈ ప్రకటన వెనక పబ్లిసిటీ స్టంటే తప్ప, వాస్తవంలా అనిపించడం లేదని, గతంలో వర్మ ఇలాంటి ప్రకటనలు చాలా చేశారని, వాటిలో చాలా వరకు ఆచరణకు నోచుకోలేదని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర మంతా శ్రీరామ రాజ్యం సినిమా ఫీవర్ ఉన్న నేపథ్యంలో తన పబ్లిసిటీ పెంచుకోవడానికే వర్మ ఇలాంటి ప్రకటన చేశారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











