రామ్ గోపాల్ వర్మ 'దొంగల ముఠా' కు పనిచేసే డైరక్టర్స్ వీరే!?
రామ్ గోపాల్ వర్మ త్వరలో "దొంగల ముఠా" అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వర్మ కాక ఐదు గురు డైరక్టర్లు పనిచేయనున్నారని తెలుస్తోంది. వీరు పూరీ జగన్నాధ్, వివి వినాయిక్, గుణశేఖర్,హరీష్ శంకర్, కృష్ణ వంశీ అంటున్నారు. వీరు ఐదుగురుకీ ఐదు యూనిట్స్ ని కేటాయిస్తారని, ఎవరు పని వారు పూర్తి చేసుకుంటూ వెళ్థారని, కాంబినేషన్ సీన్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆ ఐదు రోజులు మీడియా ఆ షూటింగ్ ని లైవ్ పద్దతిలో ఇచ్చేంత పబ్లిసిటీ ఉంటుందంటున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఈ ఐదుగురుని కో ఆర్డనేట్ చేస్తారని చెప్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం గురించి చెబుతూ వర్మ...కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-అప్పలరాజు సినిమా పిబ్రవరి 4న విడుదలైన వెంటనే వారం లోపల పిబ్రవరి 11న నేను రవితేజతో సినిమా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా అత్యంత ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ ఉత్కంఠభరితమైన ధ్రిల్లర్ అని అంటున్నారు.
పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే ఇందులో ఛార్మి, అజయ్, సుబ్బరాజు, మంచు లక్ష్మి, బ్రహ్మాజి,బ్రహ్మానందం, అజయ్, ప్రకాష్ రాజ్, కొన్ని ముఖ్యమైన పాత్రలు ఫోషిస్తున్నారు. మిగలిన పాత్రధారుల ఎంపిక ఇంకా జరుగుతోంది.సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి. అలాగే ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన మేకింగ్ టెక్నాలిజీతో చేయటం వల్లే రెండు గంటల సినిమాని కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసి, అంత వేగంగా రిలీజ్ చేయటం సాధ్యపడుతుంది. ఇలా ఈ టెక్నాలిజితో చేయటం వెనక నా ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ యుగంలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలిజీని సరైన పద్దతిలో ఉపయోగిస్తే ఏమేమి సాధించవచ్చో అనేది అందరికీ తెలియచేయటం అన్నారు.


Click it and Unblock the Notifications











