రామ్ చరణ్ స్టామినాఏంటో రామ్ గోపాల్ వర్మకి బాగా తెలుసు..
భూమ్యాకాశాలు ఏకమైనా కానీ తను పట్టిన కుందేలుకి మూడే కాళ్లన్నట్టు వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ మొట్టమెదటిసారిగా వేరే సినిమాని చూసి భయపెడుతున్నాడు. తన సినిమా విడుదల వాయిదా వేసుకున్నాడు. రక్తచరిత్ర2ని నవంబర్ 19న విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ అదే రోజున 'ఆరెంజ్ రిలీజ్ ఉందని తన సినిమా విడుదల వాయిదా వేశాడు. అయితే ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్ ఉందని తన సినిమా విడుదల వాయిదా వేశాడు. అయితే ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్ నవంబర్ 26కి మారడంతో ఇప్పుడు మళ్లీ తన సినిమాను మరో వారం పాటు వాయిదా వేస్తున్నాడు. అంటే డిసెంబర్ 3న కానీ ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నాడు. అయితే డిసెంబర్ 2న వెంకటేష్ నటించిన నాగవల్లి రిలీజ్ ఉన్నా కూడా రామ్ గోపాల్ వర్మా ఏమాత్రం జంకడం లేదు. చరణ్ గురించి చిరంజీవి గురించి ఎలాంటి కామెంట్లు వేసినా కానీ రామ్ గోపాల్ వర్మకి హీరోలుగా వాళ్ల స్టామినా ఏంటనేది బాగానే తెలుసు. అందుకే వారితో తలపడేందుకు ధైర్యం చేయడం లేదు.


Click it and Unblock the Notifications











