రామ్ చరణ్ తో పోటీ పడలేకపోతున్న రామ్ గోపాల్ వర్మ...
రామ్ చరణ్ కి చిరంజీవి అంత సీన్ లేదని అన్న రామ్ గోపాల్ వర్మే అతని సినిమాతో పోటీ పడడానికి వెనక్కి తగ్గాడు. రక్తచరిత్ర 2"చిత్రాన్ని నవంబర్ 19న విడుదల చేస్తానని పార్ట్ 1లోనే ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ చివరి నిమిషంలో బ్యాక్ స్టెప్ వేశాడు. ఆ వారంలో ఆరెంజ్ రిలీజ్ ఉందని తేలడంతో తన సినిమా రిలీజ్ ని ఇంకో వారం వెనక్కొ గెంటాడు. రక్తచరిత్ర తొలి భాగం తెలుగులోనే బాగా ఆడడం వల్ల రెండో భాగానికి వచ్చే వసూళ్లని 'ఆరెంజ్" అడ్డుకుంటుందేమోనని రామ్ గోపాల్ వర్మ దానికి దారిచ్చేశాడు.
అలాగే హిందీలో నవంబర్ 19న హృతిక్ రోషన్ నటించిన గుజారిష్ చిత్రం విడుదలకి సిద్దంగా ఉండడంతో దానికీ భయపడ్డాడు. గుజారిష్ సినిమాపై ఇష్టానికి పేలిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడా సినిమాతో పోటీ పడేందుకు జంకడం అతని రెండు నాల్కల ధోరణిని, పిరికితనాన్ని మళ్లీ ప్రపంచానికి చూపెట్టింది. ఎదుటి వాళ్లని గేలి చేయడానికి తక్కువ చేసి మాట్లాడ్డానికి ముందుండే రామ్ గోపాల్ వర్మ వాళ్లతో తలపడడానికి మాత్రం తెగబడలేనని ఇలా చాటుకున్నట్టయింది.


Click it and Unblock the Notifications











