సింగర్ అవతారమెత్తుతున్న తెలుగు స్టార్ డైరక్టర్
రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా తన రక్త చరిత్ర ప్రోమోకు వాయిస్ ఓవర్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో సాహసం కూడా చేసారని సమాచారం. అదే రక్త చరిత్ర చిత్రంలో ఓ పాట పాడారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఓ బిట్ (పాటలో ఓ చరణం) మాత్రమే పాడి ఉంటారని కొందరంటున్నారు. అయితే యూనిట్ సభ్యులు ఇది రూమర్ అని కొట్టిపారేస్తున్నారు. కానీ సెన్సేషన్ కోసం ఏదైనా చేసే రామ్ గోపాల్ వర్మ పాడే ఉండే అవకాశం ఉంది. రెండు భాగాలుగా రెడీ అయిన రక్త చరిత్ర చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇక ఆయన నిజంగా పాడారా లేదా అన్న విషయం ఆడియో విడుదల అయ్యాక తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన..సునీల్ హీరోగా చేస్తున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ..అప్పలరాజు అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సునీల్ వివేక్ ఒబరాయ్ ram gopal varma rakta charitra sunil paritala ravi vivek oberoi


Click it and Unblock the Notifications











