Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రియా చక్రవర్తిపై RGV పాజిటివ్ మూవీ.. ఆ కథలోనే కలిపేస్తాడా?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా కాంట్రవర్సీ అవ్వకుండా చేయలేడు అని అందరికి తెలిసిన విషయమే. ఏదైనా వివాదం హాట్ టాపిక్ అయ్యిందంటే చాలు వెంటనే సినిమాను ఎనౌన్స్ చేయడం ఆయనకు అలవాటు. ఆ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది తరువాత సంగతి ముందు కాంట్రవర్సీలో మనమున్నామా లేదా అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతారని అందరికి తెలిసిందే. ఇక ఆయన త్వరలో రియా చక్రవర్తి ఘటనపై కూడా మరింత ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
నేరం రుజువు కాకముందే..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పటి నుంచి కూడా అతని ప్రేయసి రియా చక్రవర్తి అనేక రకాల విచారణలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ మరణానికి ఆమెనే కారణం అంటూ ఇంకా నేరం రుజువు కాకముందే వార్తలు రావడంతో రియా తీవ్ర మనోవేదనకు గురయ్యింది. ఆ విషయంలో కొంతమంది బాలీవుడ్ స్టార్స్ రియాకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
రియాపై పాజిటివ్ కోణంలోనే..
రామ్ గోపాల్ వర్మ కూడా మొదటి నుంచి రియాకు మద్దతు ఇస్తున్నాడు. ఇక ఫైనల్ గా వర్మ రియా వ్యవహారంపై తన డైరెక్షన్ తెలివిని ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెపై పాజిటివ్ కోణంలోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామిపై సినిమా ఎనౌన్స్ చేసిన వర్మ అందులోనే రియాను పాజిటివ్ కోణంలో చూపిస్తాడా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.
అదే కథలో రియా ఎపిసోడ్..
ఆర్నాబ్ గోస్వామి బాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ డిబేట్స్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వర్మ అదే కథలో రియా ఎపిసోడ్స్ ని కలిపేస్తాడా లేక ఆమెపై సపరేట్ కథను అల్లుతాడా అనేది చూడాలి. కానీ మొత్తానికి రియా ఎపిసోడ్ పై మాత్రం RGV స్పెషల్ గా టార్గెట్ పెట్టినట్లు టాక్ వస్తోంది. త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video
త్వరలోనే మరికొంత మంది సెలబ్రిటీలను కూడా
ఇక మరోవైపు డ్రగ్స్ కేసుల వలన పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్న రియాకు ఇప్పుడు బెయిల్ దొరకడం కూడా కూడా కష్టంగా మారింది. ఆమెతో పాటు సోదరుడు కూడా కస్టడీలోనే ఉండాల్సి వస్తోంది. ఇక మరోవైపు ఇదే కేసు నుంచి రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్ వంటి వారు NCB విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే మరికొంత మంది సెలబ్రిటీలను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.