పవన్ కల్యాణ్ పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్న RGV.. ఆ రోజు ఏం షాక్ ఇస్తాడో?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనేలా రోజుకో షాక్ ఇస్తున్నాడు. కొందరికి ఆయన చేసే పనులు చిరాకు తెప్పిస్తున్నా కూడా సోషల్ మీడియాలో హీట్ పెంచడానికి మాత్రం బాగానే ఉపయోగపడుతున్నాయి. మొన్నటివరకు హాట్ అడల్ట్ సినిమాలతో రెచ్చిపోయిన వర్మ ఈసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక నెక్స్ట్ ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ పవన్ పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్నట్లు టాక్ వస్తోంది.

తెలివిగా రెడీ చేస్తున్నాడు..
పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఏ విధంగా ఉన్నాడు అనే కాన్సెప్ట్ తో వర్మ చాలా తెలివిగా పవర్ స్టార్ సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరు డైరెక్ట్ గా వాడకుండా తనదైన శైలిలో ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. లాక్ డౌన్ లో క్లైమాక్స్, నగ్నం సినిమాలతో హడావుడి చేసిన వర్మ ఇప్పుడు పవర్ స్టార్ సినిమాకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు.

వర్మ టార్గెట్.. సెప్టెంబర్ 2?
ఇక నెక్స్ట్ ఈ సీనియర్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 49వ పుట్టిన రోజు. ఆ డేట్ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ పవన్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. కేవలం 24గంటల్లోనే హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ తో 27.3మిలియన్ ట్వీట్స్ వెలువడ్డాయి.

కొంపదీసి ఆ రోజు రిలీజ్ చేస్తాడా?
ఇండియాలో నెంబర్ వన్ హ్యాష్ ట్యాగ్ గా నిలవడంతో మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే వారి జోష్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ పవన్ పుట్టినరోజున ఎవరు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడాని ఒక టాక్ అయితే వస్తోంది. పవర్ స్టార్ సినిమాను ఆ రోజు రిలీజ్ చేసినా చేయవచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Recommended Video

క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు?
అసలైతే వర్మ ఈ నెల 24న పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. రూమర్స్ పై ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చే ఆర్జీవి ఎందుకో సినిమా రిలీజ్ డేట్ పై ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు మరొక రూమర్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే వర్మ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











