రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర'తో మరో ప్రయోగం
గతంలో ఇద్దరు మిత్రులు, ఆరాధన, గోరంత దీపం వంటి ఎన్నో చిత్రాలు సినిమాలుగా రిలీజైన తర్వాత నవలా రూపంలో వెలువడ్డాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అదే రూటులో ప్రయాణం చేయనున్నారని సమాచారం. ఆయన తన తాజా చిత్రం రక్త చరిత్రని సినిమా నవల గా రాయించి విడుదల చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ రచయితతో చర్చించి,రోజూ నోట్స్ చెప్తున్నట్లు వినికిడి. ఓ ప్రక్క సునీల్ తో అప్పలరాజు చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ సినిమా నవల పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక రక్త చరిత్ర మరో కోణంలోనూ ఓ చరిత్రను సృష్టించనుంది. అది రెండు వారాల గ్యాప్ లో రెండు పార్ట్ లుగా రిలీజ్ అవటం. ఇక ఈ సినిమా నవలని తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందులోనూ గత కొంత కాలంగా సాక్షిలో నేను అనే కాలం ద్వారా ఆయన తన అనుభవాలు(బ్లాగ్ తెలుగు రూపం)ను పాఠకులతో పంచుకోవటం, దానికి మంచి రెస్పాన్స్ రావటం ఆయనకీ నవలకు స్పూర్తినిచ్చిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











