Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రామ్,ఇలియానా కన్ఫర్మ్
దేవదాస్ చిత్రంతో పరిచయమైన రామ్, ఇలియానా కాంబినేషన్ మూడేళ్ళ అనంతరం మరో సారి రిపీట్ కానుంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో స్రవంతిరవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సురేంద్రరెడ్డితో మాటలు పూర్తయ్యాయి అని సమాచారం. ఇక కిక్ విజయంతో ఉన్న సురేంద్ర రెడ్డి తన తర్వాత కథను పట్టుకుని పవన్, మహేష్ లకు చెప్పటం జరిగింది. అయితే డేట్స్ సమస్యల వల్ల ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. అయితే గణేష్ పరాజయంతో రామ్ కి హిట్ ఇవ్వాలని చూస్తున్న రవికిషోర్ ని కలసి కథ వినిపించారు. ఆయన లైన్ ఓకే చేయటంతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతోంది. ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అందులోనూ ఇలియానాను కిక్ లో చాలా అందంగా చూపి కిక్కు ఎక్కించటంతో మంచి అంచనాలే ఏర్పడతాయి. మరో ప్రక్క రామ్ సైతం కామిడీ, యాక్షన్ కలగలపిన ఎంటర్టైనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రామ్..లక్ష్యం వాసు దర్శకత్వంలో రామరామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని చ్స్తున్నారు. అర్జున్ మరో ముఖ్యపాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక సురేంద్ర రెడ్డి కొత్త ప్రాజెక్టు పిబ్రవరి 2010 నుంచి ప్రారంభం కానుంది.