కష్టం..రామ్ కీ ఆ పిచ్చా?
పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తున్నాడనే మాటలు రామ్ కెరీర్ మొదటినుంచి వినిపిస్తున్నవే. అయితే ఇప్పుడు పవన్ లాగే దర్శకత్వం వైపుకూడా రామ్ వేలు పెడుతున్నాడనే మాటలు వినపడుతున్నాయి. డైరక్టర్స్ కి సలహాలు ఇవ్వటం, ప్రోమోలు కట్ చేయటం దగ్గరనుండి, ట్రైలర్స్ కి షాట్స్ కంపోజ్ చేయటం వరకూ తన మాటే చెల్లించుకోవటం చేస్తున్నాడని అంటున్నారు. ఉన్నంతలో కాస్త సీనియర్ దర్శకుల మాట వింటున్నా కొత్త వాళ్ళయితే ఎక్కేస్తున్నాడంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే అతను దర్శకుడు అయ్యే లక్షణాలు ఉన్నాయంటున్నారు. ఇక అన్ని విషయాల్లోనూ ఆసక్తి చూపటం మంచిదేకానీ అది ఆ దర్శకుల క్రియోటివిటీని శంకించే విధంగా ఉండకూడదని మరికొందరంటున్నారు. ఇక పవన్ తో పాటు సిద్దార్ద కూడా డైరక్టర్ కి సూచనలు ఇస్తున్నాడనే టాక్ తో బ్యాడ్ అయ్యాడనే సంగతి తెలిసిందే. కాబట్టి రామ్ కాస్త దర్శకత్వం యాంబిషన్ కాస్త తగ్గించుకుని,ఆ ఐడియాలను తన సొంత సినిమా దాకా దాచుకుంటే మంచిదంటున్నారు. ప్రస్తుతం రామ్ 'గణేష్..జస్ట్ గణేష్'అనే చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు శరవణ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications