టాలీవుడ్‌లో సెన్సేషనల్ మల్టీస్టారర్.. రామ్, బాలయ్యతో మహేశ్ బాబు మూవీ
ఇండియా వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ లవర్స్ టేస్ట్‌లో గణనీయంగా మార్పులు వస్తున్నాయి. అందుకే గతంలో కంటే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీలకు ప్రేక్షకులు జై కొడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి మూవీలు వస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరిన్ని చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ పోతినేని మరో స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడని తెలిసింది. ఆ విశేషాలు మీకోసం!
డబుల్ ఇస్మార్ట్‌గా రామ్
'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ పోతినేని.. ఇటీవలి కాలంలో 'ది వారియర్', 'స్కంద' సినిమాలతో వచ్చాడు. కానీ ఇవి నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్ సాధించాలన్న లక్ష్యంతో 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

కొత్త మూవీపై ప్రచారం
ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌ను చూపిస్తోన్న రామ్ పోతినేని నటించబోయే కొత్త సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ఫలానా దర్శకుడితో చేయబోతున్నాడని చాలా రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, హరీశ్ శంకర్ సహా ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఆ స్టార్‌తో మల్టీస్టారర్
రామ్ పోతినేని నటించబోయే కొత్త సినిమా గురించిన ఓ సంచలన వార్త తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. అతడు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇది బాలయ్యకు 111వ సినిమా కాబోతుందని అంటున్నారు.
మహేశ్ బాబు ప్లాన్‌తో
రామ్ పోతినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' దర్శకుడు మహేశ్ బాబు పీ తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అతడు దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా రెడీ చేశాడని అంటున్నారు. ఇప్పటికే ఈ కథను రామ్ పోతినేనికి వినిపించాడని, త్వరలోనే బాలయ్యతో కూడా సమావేశం అవబోతున్నాడని తెలిసింది.

ఆ సంస్థ.. ఈ కథతోనే
నందమూరి బాలకృష్ణ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో మహేశ్ బాబు పీ తెరకెక్కించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుందని కూడా తెలిసింది. ఈ చిత్రాన్ని కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇద్దరు బడా హీరోలు కలిసి చేయబోయే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.
బాలయ్య బిజీ అయితే
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' సినిమాను చేయనున్నాడు. వీటి తర్వాతనే రామ్ పోతినేనితో కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయనకు వర్కౌట్ కాకపోతే మరో టాలీవుడ్ సీనియర్ హీరోను సంప్రదించాలని రామ్, మహేశ్ ప్లాన్ చేసినట్లు కూడా తెలిసింది.


Click it and Unblock the Notifications











