రామ్ పోతినేనితో భాగ్యశ్రీ బోర్సే డేటింగ్? అలా ఓపెన్ అయిన యంగ్ బ్యూటీ!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న వారు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వెంటనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహం జరిగింది. ఇటీవల మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన ప్రియురాలు కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు.
టాలీవుడ్‌లో ఇంకా చాలామంది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అడివి శేష్ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఈ కోవలోకే వస్తారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ యంగ్ హీరో.. ఇంకా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పలేదు. అయితే రామ్ వ్యకిగత జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలు ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినప్పటి నుంచి రిలీజ్ వరకు వీరిద్దరిపై రూమర్స్ ప్రారంభమయ్యాయి. రామ్, భాగ్యశ్రీ షేర్ చేసిన ఫోటోలలో బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని తీసుకొచ్చాయి. ఇక భాగ్యశ్రీ చేతికి ఉన్న రింగ్‌తో ఇంకాస్త పుకార్లు గుప్పుమన్నాయి.
రామ్ పోతినేనితో భాగ్యశ్రీకి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని, త్వరలోనే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి భాగ్యశ్రీ స్పందిస్తూ.. నా చేతి వేలికి ఉన్న ఉంగరం నేనే కొనుక్కున్నానని రిప్లయ్ ఇచ్చారు. అటు రామ్ కూడా కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో స్వయంగా ఓ పాట రాయడంతో ఇద్దరి మధ్యా సంథింగ్.. సంథింగ్ అంటూ కథనాలు వచ్చాయి.
ఇంత జరుగుతున్నా రామ్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్స్‌లో ఈ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి పాట రాసినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు పాట రాయలేదు, ఫస్ట్ టైం పాట రాశా.. అసలు ఈ పాటకి లిరిక్స్ రాసేసరికి హీరోయిన్ ఎంపిక కూడా జరగలేదని రామ్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రా కింగ్ తాలూకా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సేల మధ్య డేటింగ్ రూమర్స్ కూడా సద్దుమణిగాయి. తాజాగా భాగ్యశ్రీ కారణంగా ఇది మరోసారి తెరపైకి వచ్చాయి.
మే 15న రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో భాగ్యశ్రీ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. జీవితంలో మనకు ఎవరో ఒకరు స్పూర్తిగా నిలుస్తుంటారు. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అలాగే అనిపిస్తుంది. మీలోని ప్రతిభ, ఎనర్జీ చూసి నేను షాక్ అవుతుంటా. మీలాంటి గొప్ప వ్యక్తి నా పక్కన మంచి స్నేహితుడిగా ఉన్నందుకు నేను చాలా లక్కీగా భావిస్తున్నా. ఈ పుట్టినరోజు నుంచి మీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలవ్వాలి.. మీరు సాధించే విజయాలు, అడవిలో సింహం గర్జించినట్లు.. లోకమంతా మారుమోగాలని ఆకాంక్షిస్తున్నా అంటూ భాగ్యశ్రీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సినీవర్గాల్లో చర్చకు దారితీసింది. అలాగే రామ్ పోతినేని - భాగ్యశ్రీలు సైలెంట్‌గా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



