అనిల్ రావిపూడి తర్వాతి సినిమా కన్ఫార్మ్.. స్టోరీ విన్న వెంటనే ఓకే చేసేసిన యంగ్ హీరో
అనిల్ రావిపూడి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'F2' ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిపోయాడు. అంతేకాదు, ఆయన టేకింగ్‌కు ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. మొదట్లో రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన అనిల్.. ఇప్పుడు టాలీవుడ్‌లోనే స్టార్ హీరోల్లో ఒకరైన మహేశ్ బాబును డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పట్టాలపై ఉండగానే.. మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరితో ఆ సినిమా చేయబోతున్నాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

సరిలేరు నీకెవ్వరు అంటూ వస్తున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే, లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.

రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు
ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ టీజర్‌తో విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ అవుతుండడంతో అటు మహేశ్ అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆ ఫొటో చూసిన తర్వాత అనుమానాలు
ఇటీవల అనిల్ రావిపూడి తన పుట్టినరోజును జరుపుకున్నాడు. దీనిని పురస్కరించుకుని కొందరు సినీ ప్రముఖులు ఆ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోల్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా కనిపించాడు. దీంతో రామ్ - అనిల్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అతడికి స్టోరీ చెప్పాడని టాక్
చాలా మంది అనుమానించిందే నిజం కాబోతుందంటూ తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. రామ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన స్క్రిప్టును అనిల్ ఇటీవలే రామ్‌కు వినిపించాడట. ఇది అతడికి బాగా నచ్చేయడంతో ఈ ఎనర్జిటిక్ స్టార్ వెంటనే ఓకే చెప్పేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recommended Video

అప్పుడే కలిసి చేయాల్సింది
వాస్తవానికి రామ్.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతంలోనే సినిమా రావాల్సింది. మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్' కథ అతడి కంటే ముందు రామ్‌కు కూడా చెప్పాడు అనిల్. అయితే, ఈ సినిమాను ఎందుకో రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘సరిలేరు'తో, రామ్ ‘రెడ్'తో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్.


Click it and Unblock the Notifications











