బోయపాటి తరువాత కూడా మరో మాస్ దర్శకుడితో రామ్ పోతినేని మూవీ.. బిగ్ ప్లాన్?

గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను పెంచుకుంటున్న యువ హీరో రామ్ పోతినేని. ఈ హీరో ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి. అంతకుముందు లవర్ భాయ్ గా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసిన రామ్ పోతినేని హఠాత్తుగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూర్తిగా తన స్టైల్ ని మార్చేసుకున్నాడు. ఆ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయిన రామ్ ఆ తర్వాత రెడ్ సినిమాతో కూడా పర్వాలేదనిపించాడు.

ఇక ఇప్పుడు ది వారియర్ అనే సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తమిళ మాస్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం లో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ది వారియర్ సినిమా తరువాత అంతకుమించి అనెల మరొక సినిమా చేయాలి అని బోయపాటి శ్రీను తో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపైకి తీసుకు రావాలి అని బోయపాటి కథను రెడీ చేస్తున్నాడు.

Ram pothineni another big plan with mass director

అయితే రామ్ పోతినేని బోయపాటి సినిమా తరువాత మరో అగ్ర దర్శకుడి తో కూడా ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ దర్శకుల్లో చేరిపోయిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ అనే ఆ సినిమా తర్వాత అతను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కూడా ఓ సినిమా చేస్తాడు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే రామ్ పోతినేని కూడా ఆ దర్శకుడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

రామ్ పోతినేని తో దర్శకుడు హరీష్ శంకర్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కలయికలో కొన్నేళ్ళ క్రితమే సినిమా రానున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తానికి రామ్ పోతినేని స్టార్ హోదా పెరిగిన అనంతరం హరీష్ శంకర్ తన రేంజ్ కు తగ్గట్టుగా సినిమా చేయాలి అనే ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే వీరి కలయికలో వచ్చే ప్రాజెక్ట్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా తర్వాతనే వస్తుందట. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X