అప్పుడు రిజెక్ట్ చేసిన కథపై ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న రామ్

ఒకసారి వద్దనుకున్న ప్రాజెక్టుపై హీరోలు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపరని అందరికి తెలిసిన విషయమే. కథలో మెయిన్ పాయింట్ నచ్చితే ఎదో కొన్ని మార్పులు చేయగలిగితే వర్క్ చేయడానికి ధైర్యం చేస్తారు గాని కొందరైతే రిస్క్ అనుకున్న కథల జోలికి వెళ్ళడానికి మాత్రం చాలా భయపడతారు. అయితే ఇటీవల రామ్ పోతినేని కొన్నేళ్ల క్రితం రిజెక్ట్ చేసిన కథపై ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ కెరీర్ లో విజయాల కంటే కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆలోచించకుండా తొందరపడి చేసిన సినిమాలతో వరుస డిజాస్టర్స్ ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కథకు న్యాయం చేయగలను అనుకుంటేనే సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇక త్వరలోనే PSV గరుడవేగ దర్శకుడు చెప్పిన ఒక కథలో సరికొత్తగా కనిపించబోతున్నాడట.

ram pothineni another movie with successful director

దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొన్నేళ్ల క్రితం చెప్పిన ఒక డిఫరెంట్ కథ చేయడానికి భయపడిన రామ్ మొదట ఒప్పుకున్నప్పటికి ఆ తరువాత రిస్క్ చేయలేను అని రిజెక్ట్ చేశాడు. ఇక ఆ తరువాత ప్రవీణ్ కొన్ని మార్పులు చేశాడట. విషయం తెలుసుకున్న రామ్ మళ్ళీ దర్శకుడితో చర్చలు జరిపి సరికొత్తగా కథను విన్నాడట. నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వీలైనంత త్వరగా రెడ్ సినిమాను రిలీజ్ చేసి ఆ కథను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ప్రవీణ్ నాగార్జునతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి ముందు ఎవరితో వర్క్ స్టార్ట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X