ఎనర్జిటిక్ స్టార్ శపథం చేశాడు.. పరోక్షంగా పూరి జగన్నాథ్ గురించేనా !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటనలో ఎలాంటి లోపం కనిపించదు. సినిమా ఎలా ఉన్నా తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో రామ్ అదరగొట్టేస్తుంటాడు. నటన, డాన్సులలో రామ్ కు అద్భుత ప్రావీణ్యం ఉంది. నేను శైలజ చిత్రంతో విజయాన్ని అందుకుని అప్పటివరకు ఎదురవుతున్న వరుస పరాజయాలకు అడ్డు కట్ట వేశాడు. నేను శైలజ తరువాత మళ్ళీ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. రామ్ ఇటీవల నటించిన హలొ గురు ప్రేమ కోసమే చిత్రం పరవాలేదనిపించింది. రామ్ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఓకే అనిపించింది

ఓకే అనిపించింది

రామ్ చివరగా నటించిన హలొ గురు ప్రేమ కోసమే చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కానీ అభిమానులని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. అనుపమ పరమేశ్వరన్, రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ భావిస్తున్నాడు.

ఆర్ఎక్స్100 దర్శకుడితో

ఆర్ఎక్స్100 దర్శకుడితో

ఆ మధ్యన ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రామ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా రామ్ కోసం పూరి జగన్నాథ్ కూడా కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇటీవలే పూరి జగన్నాథ్ రామ్ ని కలసి కథ వినిపించాడట. పూరి చెప్పిన పాయింట్ నచ్చడం తో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

ఫ్యాన్స్‌కు మాట ఇచ్చాడు

ఫ్యాన్స్‌కు మాట ఇచ్చాడు

ఇటీవల రామ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. హలొ గురు ప్రేమకోసమే చిత్రం మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరచలేదు. అయినా కూడా మంచి విజయాన్ని అందించారు. తదుపరి చిత్రంతో వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు రామ్. రామ్ చేసిన ఈ కామెంట్స్ పూరి జగన్నాథ్ తో చేసే సినిమా గురించేనా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల పూరి జగన్నాథ్ కు సరైన విజయం లేదు. అయినా కూడా హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా కథ సిద్ధం చేయడం, స్టైలిష్ లుక్ లో హీరోలని చూపించడంలో పూరి దిట్ట.

సరికొత్త లుక్

సరికొత్త లుక్

పూరి జగన్నాథ్ చెప్పిన కథపై నమ్మకంతోనే రామ్ శపథం చేసినట్లుగా అభిమానులకు మాట ఇచ్చాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ చివరగా చేసిన చిత్రం మెహబూబా. తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. మెహబూబా విడుదలైన తరువాత పూరి బాగా గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం రామ్ విభిన్నమైన హెయిర్ కట్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ పూరి చిత్రం కోసమే అని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X