సుకుమార్‌తో ఎనర్జిటిక్ స్టార్.. సెట్ చేసుకున్న రామ్.. క్రేజీ అప్‌డేట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ యమ జోష్‌లో ఉన్నాడు. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అందరినీ ఆకట్టుకోగల ఈ యువ హీరో మరోసారి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

ఇస్మార్ట్ హీరో.. అదే స్పీడ్ కంటిన్యూ
ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ హిట్ సాధించాడు హీరో రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆయన కెరీర్‌నే మలుపుతిప్పింది. కీలక సమయంలో రామ్‌ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ చిత్రంలో రామ్ అభినయం చేసి మాస్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. దీంతో అదే స్పీడ్ కంటిన్యూ చేసేలా అడుగులేస్తున్నారు రామ్.

విభిన్న తరహా మూవీ RED
ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న RED సినిమాలో నటిస్తున్నాడు రామ్. విభిన్న తరహా కథనంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీ కథ సిద్ధం చేసుకొని కెమెరా ముందు పెట్టారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఇదిలా ఉండగానే తాజాగా తన తదుపరి సినిమాను సుకుమార్ తో కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో ఆ డైరెక్టర్‌తో జగడం.. మళ్ళీ ఇప్పుడు
ఇటీవలే సుకుమార్ వినిపించిన కథ రామ్‌ని బాగా అట్రాక్ట్ చేసిందట. కథ చాలా కొత్తగా ఉందని వెంట రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో 2007 సంవత్సరం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జగడం' కమర్షియల్ హిట్ సాధించన్నప్పటికీ.. హీరో రామ్‌కి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మళ్లీ ఈ కాంబోలో సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో ఆత్రుత మొదలైంది.
Recommended Video

అల్లు అర్జున్, రష్మిక మందన్నలతో సుకుమార్
ఇకపోతే సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు సినిమాను పూర్తిచేసిన వెంటనే రామ్ సినిమాతో సుకుమార్ సెట్స్ మీదకు వస్తారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











