కథలను రిజెక్ట్ చేయడంలో రికార్డ్ క్రియేట్ చేస్తున్న యువ హీరో
14ఏళ్ళ క్రితం దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ పోతినేని గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహా నిర్ణయాలతో కెరీర్ ని మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకుంటున్నాడు. అతను కెరీర్ లో వేసిన కొన్ని తప్పటడుగుల నుంచి పాఠాలు ఎంత వరకు నేర్చుకున్నాడో తెలియదు కాని నెక్స్ట్ టైమ్ మాత్రం మళ్ళీ రిస్క్ చేయవద్దని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన స్టైల్ ని పూర్తిగా మార్చేశాడు.
తమిళ్ మూవీ తడమ్ ను తెలుగులో రెడ్ గా రీమేక్ చేసిన రామ్ ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అయితే రామ్ సరికొత్త మెకోవర్ ఆయనకు అనేక రకాల డిఫరెంట్ కథలు వచ్చేలా చేస్తున్నాయట. స్మార్ట్ గా కనిపించే చాక్లెట్ బాయ్ లో సరికొత్త యాంగిల్స్ ని చూసి దర్శక నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. అయితే రామ్ మాత్రం తొందరపడకుండా చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

ఈ రెండు మూడు నెలల్లోనే 15కి పైగా కథలు రాగా అందులో డజను కథలను రిజెక్ట్ చేశాడట. రొటీన్ గా ఏ మాత్రం అనిపించినా కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదట. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడు. రామ్ మళ్ళీ కొత్తగా ఎదో ట్రై చేశాడని జనాలు అనుకునేలా ఉండాలిని ఫిక్స్ అయ్యాడట. అందుకే కథ నచ్చకపోతే దర్శకులకు రైటర్లకు మొహం మీదే నచ్చలేదని చెప్పేస్తున్నాడట. మరి ఈ కొత్త తరహా ఆలోచనలతో రామ్ భవిష్యత్తులో ఎలాంటి హిట్స్ ఎందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











