RED ప్రీ రిలీజ్ బిజినెస్.. ఓ రేంజ్‌లో మార్కెట్! రామ్ సత్తా అంటే ఇదే మరి..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తనలోని మాస్ మసాలా అంతా బయటకు తీసి ప్రేక్షకలోకానికి న్యూ టేస్ట్ చూపించాడు. దీంతో రామ్ తదుపరి సినిమాలపై ఓ రేంజ్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో తన లేటెస్ట్ మూవీ RED పై అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి నిదర్శనమే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇంతకు RED బిజినెస్ ఎలా ఉంది? ఏ ఏరియాలో ఎంత? వివరాల్లోకి పోతే..

Recommended Video

Ram Pothineni's Red Movie Pre Release Business || Filmibeat Telugu
 సక్సెస్‌ఫుల్ కాంబో.. RED

సక్సెస్‌ఫుల్ కాంబో.. RED

'తడమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా RED పేరుతో తెరకెక్కుతోంది రామ్ లేటెస్ట్ మూవీ. క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ''నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ'' సినిమాలు డూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై ముందునుంచే అంచనాలు నెలకొన్నాయి.

 ఆసక్తి రేకెత్తించిన రామ్.. ఆ ఎఫెక్ట్!

ఆసక్తి రేకెత్తించిన రామ్.. ఆ ఎఫెక్ట్!

క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ డిఫరెంట్ లుక్ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఈ ఎఫెక్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌పై పడి ఓ రేంజ్ మార్కెట్ వచ్చేసింది.

 భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్న బయ్యర్లు

భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్న బయ్యర్లు

ఈ సినిమా కోసం బయ్యర్లు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారని తెలిసింది. ఆంధ్రలో RED సినిమా థియాట్రికల్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. అలాగే సీడెడ్‌లో 4 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ఇక నైజాం, వైజాగ్, కృష్ణలో శ్రీ స్రవంతి మూవీస్ సొంతంగా రిలీజ్ చేసుకోనుందట.

రామ్ క్యారెక్టర్.. డిఫరెంట్ షేడ్స్

రామ్ క్యారెక్టర్.. డిఫరెంట్ షేడ్స్

RED సినిమాలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఆయన సరసన నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఓ స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వేసవిలో RED హంగామా..

వేసవిలో RED హంగామా..

శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ నంబర్స్ చూస్తుంటే మరోసారి రామ్ సత్తా చాటనున్నాడని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం మరి.. ఈ వేసవిలో RED హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X