నాని వస్తే.. రామ్, సాయి కూడా దిగాల్సిందే.. లేకపోతే నష్టాలే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మిడియామ్ రేంజ్, హీరోలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. సగంలో ఆగిపోయిన సినిమా పరిస్థితి ఒకలాగా ఉంటే.. ఆల్ మోస్ట్ షూటింగ్స్ పూర్తి చేసిన హీరోల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరోనా వైరస్ కారణంగా కెరీర్ లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఎవరు కూడా పెద్దగా ఊహించలేదు. ఇక చేసేదేమి లేక చాలా మంది ఓటీటీల దారి పడుతున్నారు. ఎంతో కొంత వచ్చిందే లాభం అనుకోని నష్టాల భారిన పడకుండా డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో రిలీజ్ చేస్తున్నారు.

అప్పట్లో కౌంటర్..

అప్పట్లో కౌంటర్..

ప్రస్తుతం నాని 25వ సినిమా V డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. సమ్మర్ మొదట్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఊహించని విధంగా కరోనా సమయంలో వాయిదా పడక తప్పలేదు. ఎంత ఆలస్యం అయినా కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని అప్పట్లో చిత్ర యూనిట్ రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.

 వారు కూడా దిగాల్సిందే..

వారు కూడా దిగాల్సిందే..

కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా అఫీషియల్ గా స్పందించడం లేదు. దీంతో రూమర్స్ డోస్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే నాని లాంటి స్టార్ హీరో సినిమానే ఓటీటీలో రిలీజ్ అవుతుంటే అంతకంటే కొంచెం తక్కువ మార్కెట్ ఉన్న సాయి ధరమ్ తేజ్, రామ్ వంటి వారు కూడా ఆ దారిలోనే వారి సినిమాలను రిలీజ్ చేయక తప్పదనే టాక్ వస్తోంది.

 సాయి ' సోలో బ్రతుకే సో బెటర్' కూడా

సాయి ' సోలో బ్రతుకే సో బెటర్' కూడా

సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' అని సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై సాయి గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే సినిమా థియేటర్లు ఓపెన్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఓపెన్ అయినా కూడా జనాలు పెద్దగా రాకపోవచ్చు. చేసేదేమీ లేక ఈ సినిమా నిర్మాత కూడా ఓటీటీ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.

Recommended Video

Penguin Trailer | Penguin OTT Worldwide Release on June 19
రామ్ 'రెడ్' పరిస్థితి కూడా అంతేనా?

రామ్ 'రెడ్' పరిస్థితి కూడా అంతేనా?

ఇక రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవాలని రెడ్ అనే సినిమాను లైన్ లో పెట్టాడు. సినిమా ఆల్ మోస్ట్ రెడీ అయిన సమయంలో కరోనా దెబ్బ పడింది. ఇక నాని, సాయి ధరమ్ తేజ్ లాంటి హోరోలు ఓటీటీ వైపు వెళుతున్నారు అంటే రామ్ కూడా అటు వైపు వెళ్లాల్సిందే అనే కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు థియేటర్స్ మీద నమ్మకం పెట్టుకోవడం రిస్క్ తో కూడుకున్న పనే. ఇక వారికి మిగిలింది ఓటీటీ దారే అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X