Double iSmart: డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లీక్.. ఈ ట్విస్టుకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం
తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు దర్శకులు ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకడు. గతంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. రామ్ పోతినేని హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో 'డబుల్ ఇస్మార్ట్' మూవీని తెరకెక్కించాడు. మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్విస్ట్ తాజాగా లీకైంది. ఆ వివరాలను మీరే చూడండి!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' క్రేజీ హిట్‌ను అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించి విడుదలకు రెడీ చేసేశారు.

రామ్ నటించిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ సైతం పూర్తి చేసుకుంది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని హైలైట్లు రివీల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని క్లైమాక్స్ గురించి ఓ ఊహించని న్యూస్ బయటకు వచ్చింది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందట. ఆ సమయంలో రామ్ పోతినేని నుంచి డబుల్ డోస్ సర్‌ప్రైజ్ ఉంటుందట. ఈ సీన్ చూసిన వాళ్లకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం అని అంటున్నారు. దీంతో ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేస్తోంది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











