The Warrior సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు.. రామ్ ఎందుకు ఒప్పుకున్నాడంటే?
రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమా రీసెంట్ గా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రామ్ విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేశాడు. అలాగే మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా గట్టిగానే అందుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీగానే హైప్ క్రియేట్ చేశారు. దర్శకుడు లింగుస్వామి కోలీవుడ్ లో అగ్ర దర్శకులతో హీరోలతో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయించాడు. ఇక ది వారియర్ సినిమా మొత్తానికి ఫస్ట్ డే అయితే కలెక్షన్లు భాగానే అందుకుంది. ఇక వీకెండ్ లో కూడా ఇలానే కలెక్షన్స్ గట్టిగానే వచ్చే అవకాశం ఉంది.
అయితే లింగుస్వామి ఈ కథ రామ్ కు చెప్పడానికి ముందే మరో ఇద్దరి అగ్ర హీరోలకు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో లింగస్వామి అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు టాకు వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తమిళంలో కూడా సినిమా చేయాలి అని ఎప్పటి నుంచి ప్రణాళికలు రచించినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ది వారియర్ కథను పూర్తిగా సిద్ధం చేయకముందే మెయిన్ కథ గురించి అల్లు అర్జున్ తో చర్చలు జరిపారు.
అయితే అప్పట్లో అల్లు అర్జున్ కు వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన ఆ కథను ఓకే చేయలేకపోయాడట.

ఇక తర్వాత లింగస్వామి మరికొన్ని సినిమాలతో బిజీ అవ్వడం వల్ల గ్యాప్ వచ్చేసింది. ఇక ఇంతలో రామ్ పోతినేని ఆ కథ గురించి విని ఓకే చేశాడు. అయితే అల్లు అర్జున్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఈ కథ గురించి చర్చలు జరపడం చేశాడట. కానీ ఎన్టీఆర్ అప్పటికే టెంపర్ సినిమా చేసి ఉండడంతో మరొక పోలీస్ కథ వెంటనే చేయడానికి ఇష్టపడలేదు. దీంతో లింగస్వామి ఫైనల్ గా రామ్ పోతినేనితో ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక సినిమా కమర్షియల్ అంశాలతో వర్గం వారిని బాగానే ఆకట్టుకొని మొదటి రోజు కలెక్షన్స్ కూడా పాజిటివ్ గానే అందుకుంది. మరి సినిమా పూర్తిస్థాయిలో ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











