For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RaPo20 ఫిక్స్.. స్టార్ డైరెక్టర్ తో అదిరే మాస్ ట్రీట్ కి సిద్దం.. రెండు బాషలలో?

  |

  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాలా కాలం తర్వాత రామ్ పోతినేని బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అనంతరం మళ్ళీ అదే రేంజ్ లో హిట్ కొట్టాలని అనుకుని రామ్ 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న రామ్ తన తదుపరి సినిమా తమిళ్ డైరెక్టర్ లింగుసామితో చేస్తున్న విషయం తెలిసిందే. బైలాంగ్యువల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. అయితే ఆ సినిమా అనంతరం వెంటనే మరొక సినిమా కూడా రామ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  త్వరగా పూర్తి చేసి

  త్వరగా పూర్తి చేసి

  వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఈ మధ్యనే రెగ్యూలర్ షూటింగ్‌ ప్రారంభం అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోల ఈ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ఫిల్మ్ చిత్రీకరణను పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో

  ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో

  ఆ ప్లాన్ లో భాగంగానే ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా టాకీ పార్ట్‌ కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ గురించి చాలా రోజులుగా ఎన్నో వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కథా నేపథ్యం గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ ప్రచారం ప్రకారం ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోందని అంటున్నారి. మరీ ముఖ్యంగా ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతుందనే టాక్ ఉంది.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

  మళ్ళీ ఆయనే

  మళ్ళీ ఆయనే

  ఇక ఆ సంగతి పక్కన పెడితే రామ్ కు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ రీసెంట్ గా ఒక ఊర మాస్ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ ప్రచారం జరగగా తాజాగా ఆ సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా కూడా రెండు భాషల్లో రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు అని అంటున్నారు.

  మామూలుగా ఉండదు మరి

  మామూలుగా ఉండదు మరి

  బోయపాటి సినిమా అంటే మాస్ యాంగిల్ మామూలుగా ఉండదు, అలాంటి ఆయన కధలో రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో నటిస్తే మరో లెవల్ లో సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక త్వరలో ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ బాలయ్యతో చేస్తున్న అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

  అఖండతో బిజీ

  అఖండతో బిజీ

  నిజానికి ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అనుకున్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఆ సినిమా అయిపోగానే బోయపాటి మరో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశాడు. కొందరు హీరోలకు కథలు చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఆయన అల్లు అర్జున్ కి కూడా కథ చెప్పాడని అంటున్నా దానికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ లేదు.

  English summary
  As per latest reports Ram Pothineni teaming up with BoyaPati srinu and Akhanda Producer Miryala Ravinder Reddy for his 20th movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X