Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కామెడీ దర్శకుడితో రామ్ న్యూ ప్రాజెక్ట్.. ఆ మల్టీస్టారర్ సినిమా తరువాతే..
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో 2019లో బాక్సాఫీస్ హిట్ అందుకున్న రామ్ పోతినేని మళ్ళీ రెడ్ సినిమాతో అదే రేంజ్ లో హిట్ కొట్టాలని చూశాడు. అయితే రెడ్ ఆ స్థాయిలో సంచలనాలను సృష్టించడం లేదు. కానీ పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చి హిట్ ఫిల్మ్ గా నడుస్తోంది. ఇక సోమవరమే సినిమా కలెక్షన్స్ బాగా తగ్గాయి. హాలిడేస్ పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ పుంజుకోవడం అంటే కష్టమే.
ఇక రెడ్ లాంటి థ్రిల్లర్ సినిమా అనంతరం రామ్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. దర్శకులు కథలు రెడిగానే ఉన్నప్పటికీ రామ్ మాత్రం రిస్క్ చేయాలని అనుకోవడం లేదు. అసలు మ్యాటట్ లోకి వస్తే ఈ దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. అసలైతే వీరి కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సింది.
మొదట రాజా ది గ్రేట్ కథను రామ్ కు కూడా చెప్పడం జరిగింది. కానీ అందుకు రామ్ ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా ఇప్పుడు అనిల్ చెప్పిన మరొక డిఫరెంట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకా స్క్రిప్ట్ మొత్తం రెడీ కాకపోయినప్పటికి అనిల్ మీద కాన్ఫిడెన్స్ తోనే హీరో ఒప్పుకున్నట్లు టాక్. ఇక అనిల్ ప్రస్తుతం మల్టీస్టారర్ గా రూపొందుతున్న F3 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత రామ్ కథను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.