బడా డైరెక్టర్‌కు ఓకే చెప్పేసిన రామ్.. మరో ఊర మాస్ కథతో సినిమా.. ఒకేసారి రెండు రోల్స్

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఫలితంలో మాంచి ఖుషీ మీద ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. గతంలో కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్ హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి అందుకు తగ్గట్లే రామ్ ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే మరో మాస్ డైరెక్టర్‌కు ఓకే చెప్పేశాడని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ ముద్ర పడకూడదనుకున్నాడు

ఆ ముద్ర పడకూడదనుకున్నాడు

ఇస్మార్ట్ శంకర్ సినిమా పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ మరో మాస్ సినిమా చేయడానికి సిద్ధంగా లేడన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అతడిపై మాస్ హీరో అనే ముద్ర పడకూడదనేనట. వరుసగా రెండు సినిమాలు చేస్తే ఆ ప్రమాదం ఉండడంతో, కొన్ని ఫ్యామిలీ, లవ్ బేస్‌డ్ మూవీస్ చేసి ఆ తర్వాత ఈ సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

ఇప్పుడదే కావాలనుకుంటున్నాడు

ఇప్పుడదే కావాలనుకుంటున్నాడు

మాస్ సినిమాలు చేయకూడదన్న ఉద్దేశ్యంతో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. కానీ, ఈ సినిమా స్టార్ట్ కాలేదు. దీనికి కారణం ఈ సినిమా కథకు మాస్ టచ్ ఇవ్వమని దర్శకుడికి రామ్ సూచించడమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

నమ్ముకున్నోడు హ్యాండ్ ఇచ్చాడు

నమ్ముకున్నోడు హ్యాండ్ ఇచ్చాడు

రామ్ సూచన మేరకు స్క్రిప్టులో మార్పులు చేసి మాస్ కథను తయారు చేశాడట కిశోర్ తిరుమల. అయితే, ఈ కథ రామ్‌కు నచ్చలేదని తాజాగా మరో వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

బడా డైరెక్టర్‌కు ఓకే చెప్పేశాడు

బడా డైరెక్టర్‌కు ఓకే చెప్పేశాడు

ఇక, తాజాగా రామ్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అతడు ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వీవీ వినాయక్‌తో సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే ఆయన చెప్పిన మాస్ స్టోరీ రామ్‌కు నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఇందులో రామ్ క్యారెక్టర్ హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపైనా అప్పుడే ఊహాగానాలు ఎక్కువైపోయాయి.

ఒకేసారి రెండు రోల్స్

ఒకేసారి రెండు రోల్స్

వీవీ వినాయక్.. దిల్ రాజు బ్యానర్‌లో హీరోగా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన తన మేకోవర్‌ను సైతం మార్చుకుంటున్నారు. జిమ్ములో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం అవడానికి సమయం ఉండడంతో.. ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడట. ఇందులో భాగంగానే రామ్‌కు కథ వినిపించాడని టాక్. ఈ సినిమా పట్టాలెక్కితే.. వినాయక్ ఒకేసారి హీరోగా, డైరెక్టర్‌గా రెండు రోల్స్‌లో చేస్తాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X