»   »  నిజమా ? :రామ్ 'పండగ చేస్కో' ఇన్ సైడ్ టాక్

నిజమా ? :రామ్ 'పండగ చేస్కో' ఇన్ సైడ్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ఫెయిల్యూర్స్ తో ఉన్న రామ్ తన తదుపరి చిత్రం 'పండగ చేస్కో' ని రేపు ధియోటర్లలలో దించుతున్నారు. ఈ చిత్రంపై ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ సైతం ఇంతకీ సినిమా రిజల్ట్ ఏమి కావచ్చు అనే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇన్ సైడ్ రిపోర్ట్ ప్రకారం...యావరేజ్ రిపోర్ట్ వినపడుతోంది. అయితే సెకండాఫ్ లో కామెడీ పూర్తిగా జనాలకి కిక్కు ఇచ్చేస్తే మాత్రం మంచి హిట్ అయ్యే అవకాసం ఉందంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కొత్త కథ కాదని, ఉన్న కథనే ఎంటర్టైన్మెంట్ తో చెప్పటానికి దర్శకుడు ప్రయత్నించాడని అంటున్నారు. సెకండాఫ్ లో వీకెండ్ వెంకట్రావ్ గా బ్రహ్మానందం అదరకొట్టనున్నాడని, ఆ కామెడీ సీన్స్ సినిమాలో హైలెట్ అవుతాయని అంటున్నారు. అలాగే రెండు పాటలు చాలా బాగున్నాయని ఈ చిత్రం ఫ్యామిలీలలు ఖచ్చితంగా పట్టే అవకాసం ఉందని చెప్తున్నారు. అదే సమయంలో సూర్య రాక్షసుడు సినిమా ఎట్టిపరిస్దితుల్లో పోటీ కాదని చెప్పుకుంటున్నారు.

హీరోని ప్రక్కన పెట్టి బ్రహ్మానందం మీద కట్ చేసిన ఈ ట్రైలర్ ఈలోగా చూడండి...

ఇక రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

 Ram, Rakhul 's Pandagachesuko inside talk

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Ram, Rakhul Preeth Singh starrer " Pandagachesuko", the film will be an above average to average film Branamdam's comedy sequence around 30 minutes in second half will be highlight of the film.
Please Wait while comments are loading...