twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ట్విస్ట్: ట్రైలర్ కు డబ్బింగ్ చెప్పి..సినిమాకు చెప్పటం లేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరో రామ్ ఇంకా తన నిర్మాతను కరుణించలేదు. డబ్బులిస్తేనే డబ్బింగ్ చెప్తా అంటూ ఓ మెట్టు కూడా దిగకుండా అలాగే కూర్చున్నాడనే సమాచారం. సర్లే ...ట్రైలర్ రిలీజ్ చేసుకుంటానంటే అప్పటివరకూ కనికరించి...డబ్బింగ్ చెప్పి,సహకరించాడని తెలుస్తోంది. దాంతో ఎప్పుడు డబ్బింగ్ చెప్తాడు..రిలీజ్ అనుకున్నట్లుగా చేయగలమా అనే టెన్షన్ లో నిర్మాత పడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ విషయమై మీడియాలో వార్తలు వచ్చినా కొద్దిగా కూడా రామ్ చలించలేదని అంటున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అసలే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పరిస్ధితి బాగోలేదు. దానికి తోడు రామ్ వరస ఫ్లాపుల్లో ఉండటం కూడా బిజినెస్ పరంగా ఇబ్బందే. ఇలాంటప్పుడు నమ్మి నిర్మాత అన్నేసి కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పుడు హీరో సహకరించాల్సింది పోయి ఇలా ఏడిపించటం న్యాయం కాదని ఓ వర్గం అంటోంది. అయితే డబ్బింగ్ చెప్పాక,నిర్మాత డబ్బులు ఎగ్గొడితే ఏంటి పరిస్ధితి అంటే అశోశియోషన్లు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఉన్నాయిగా. అంత నమ్మకం లేకుండా సినిమాలు ఒప్పుకోవటం ఎందుకు అని విమర్శిస్తున్నారు.

    Ram Refuses 'Pandaga Chesko' Movie Dubbing For Settle The Balance..?!

    ఇప్పటికే రామ్‌కు ఇవ్వాల్సిన రూ. 50 లక్షలు సినిమా విడుదల సమయంలో ఇస్తానని నిర్మాత ఎంతలా చెప్పినా పాపం హీరో కి మాత్రం దయ కలగడం లేదని అంటున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతకు హీరో చేయూత ఇచ్చి అండగా నిలబడాలి కానీ ఇలా ఇబ్బందులు పెడుతూ సినిమా విడుదలకు అడ్డుపెట్టడం ఏమంతా బాగోలేదని పద్దతిగా లేదని మీడియా అంటోంది..ఫిల్మ్‌నగర్‌లో బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

    ఉన్న వూరుకు, కన్నవాళ్లకు దూరంగా విదేశాల్లో ఉంటూ నాలుగు డాలర్లు వెనకేసుకోవడం కంటే తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు ఆ యువకుడు. అలాంటి ఓ యువకుడి కథే మా చిత్రం అంటున్నారు రామ్‌.

    ''కుటుంబ సమేతంగా చూసి పండగ చేస్కొనే సినిమా ఇది. రామ్‌ చురుకుతనం, రకుల్‌, సోనాల్‌ల అందచందాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తామ''అంటున్నాయి చిత్రవర్గాలు.

    ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని.

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

    English summary
    If the reports in circulation are to be believed, Hero Ram refused to dub for his upcoming flick 'Pandaga Chesko' until he receives full remuneration from the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X