twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గరం మసాలా' టైటిల్ తో రామ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హిందీలో విజయవంతమైన 'బోల్‌బచ్చన్‌' ఆధారంగా వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయభాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ పై మంచి అంచనాలే ట్రేడ్ లో ఉన్నాయి.

    డి.సురేష్‌బాబు, 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మాతలు. ఇక ఈ చిత్రానికి 'గరం మసాలా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు 'సర్వేజనా సుఖినో భవంతు ' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన అంజలి నటిస్తుంది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది.

    బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

    ఇక రీసెంట్ గా వెంకటేష్ నటించిన 'షాడో' చిత్రం భాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే ఆ మధ్య రామ్ 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి చిత్రం కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు కాన్సెల్ అయినట్లు ఆ ప్రాజెక్టుని దగ్గుపాటి రానా తో చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

    English summary
    
 Venkatesh, Ram’s starrer film of ‘Bol Bachchan’ Hindi film re-make directed by Vijay Bhaskar is titled as Garam Masala. Venkatesh is doing Ajay Devagan role, Ram doing Abhishek Bachan role. Venkatesh’s brother Suresh Babu and Ram’s uncle Sravanthi Ravi Kishore will be jointly producing this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X