హీరో రామ్ సబ్జెక్ట్ మెగా కాంపౌండ్ లో...?
రామ్ సినిమాలపై తన మనోగతం గురించి వెల్లడిస్తూ 'నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని చెపుతున్నారు రామ్.
ఇక రామ్ హీరోగా విజయభాస్కర్.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మసాలా' మళ్లీ వాయిదా పడింది. ఎన్నో వాయిదాలు అనంతరం నవంబర్ 1 అంటే దీపావళి కి విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే థియోటర్ సమస్యలతో మళ్లీ ఈ చిత్రాన్ని నవంబర్ 14కి వాయిదా వేసినట్లు సమాచారం. హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' ఆధారంగా రూపొందుతోంది. వెంకటేష్, రామ్ గా నటిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్స్. డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్ నిర్మాతలు. డి.రామానాయుడు సమర్పకులు.


Click it and Unblock the Notifications












