పవర్‌ఫుల్ పాత్రలో పవన్ కల్యాణ్.. ఒకటి కాదు, రెండు.. సినిమాల్లోకి లాగుతున్న ఆ ఇద్దరు!

Recommended Video

Pawan Kalyan To Do Movie In Political Theme | Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టంతా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనే నిలిచింది. ఇక సినిమాల్లో నటిస్తాడా అనే ప్రశ్నలకు రకరకాల సమాధానం వస్తున్నాయి. కానీ పవర్‌స్టార్ మాత్రం సినిమాలపై పెదవి విప్పడం లేదు. కానీ మీడియాలో మాత్రం పవన్ సినిమాపై తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది. కొందరు నిర్మాతలు కూడా పవన్ సినిమా చేయడం గ్యారంటీ అని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ పవన్ చేసే సినిమా ఏంటీ? ఎవరి కోసం చేస్తున్నారనే వార్తల వివరాల్లోకి వెళితే..

పొలిటికల్ నేపథ్యంగా కథతో

పొలిటికల్ నేపథ్యంగా కథతో

టాలీవుడ్ సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కోసం ఓ రాజకీయ నేపథ్యంగా సాగే సినిమా కోసం కథ సిద్ధమైందట. ఈ సినిమాలో పవర్ స్టార్ నటించనున్నట్టు వార్తలు బలంగా చెబుతున్నాయి. ప్రస్తుత రాజకీయాలు, పవన్ ఆలోచనా విధానానికి తగినట్టుగా సినిమా కథ ఉండనున్నదట.

పవర్ ఫుల్ రాజకీయ వేత్త‌గా

పవర్ ఫుల్ రాజకీయ వేత్త‌గా

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ రాజకీయ వేత్త పాత్రలో కనిపిస్తారట. ఆయన పాత్ర నిడివివ కేవలం 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట. కానీ సంచలనాలకు వేదికయ్యే స్పెషల్ రోల్‌గా మలువబోతున్నరట. ఈ చిత్రంలో ఓ యువ హరీో కూడా నటిస్తున్నట్టు తెలిసింది.

గోపాల గోపాల చిత్రంలో స్పెషల్‌గా

గోపాల గోపాల చిత్రంలో స్పెషల్‌గా

గతంలో కూడా పవన్ కల్యాణ్ స్పెషల్ రోల్‌లో కనిపించారు కూడా. గోపాల గోపాల చిత్రంలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చి సినిమాను హిట్‌గా మలిచాడు. ప్రస్తుతం అదే స్కీమ్‌లో కథను అల్లుతున్నారట. ఈ సినిమాను ఏపీ ఎన్నికల సమయంలో విడుదల చేస్తే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

పవన్‌తో నేల టికెట్ నిర్మాత

పవన్‌తో నేల టికెట్ నిర్మాత

పవన్‌తో నేల టికెట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరికి జనసేనతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నేల టికెట్టు సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే.

మా వద్ద పవన్ కల్యాణ్ డేట్స్

మా వద్ద పవన్ కల్యాణ్ డేట్స్

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ మా సినిమాలో నటిస్తాడని ఇటీవల మైత్రీ మూవీస్ భాగస్వామి యెర్నెని నవీన్ కూడా బల్ల గుద్ది చెప్పారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ డేట్స్ మా వద్ద ఉన్నాయి. ఆయన నటిస్తాడు. కానీ ఎప్పుడు నటిస్తాడనే విషయం ఇప్పుడే చెప్పం. కానీ పవర్ స్టార్ మాత్రం మా బ్యానర్లో ఓ సినిమా చేస్తాడు అని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్సుగా కొంత మొత్తం ఇచ్చారనే విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X