Ramayana: రామాయణంలో మరో సౌత్ స్టార్​ హీరో.. అంచనాలు పెంచేశారుగా

Ramayana Movie: భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా విజువల్ ఎపిక్ రామాయణ (Ramayana). బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నితీష్ తివారీ (Nitesh Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీ లవర్స్ తో పాటు ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం 'రామాయణ' విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పాన్ వర్డల్ మూవీలో సౌత్ స్టార్ హీరో నటించబోతున్నరట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ స్టార్ హీరో క్యారెక్టర్ ఏంటీ?

ఈ మెగా ప్రాజెక్ట్‌లో రాముడిగా రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor),సీతగా సాయి పల్లవి(Sai Pallavi), హనుమంతుడిగా సన్నీ డియోల్ (Sunny Deol) నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రహమాన్ తో పాటు హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జీమ్మర్ కలిసి సంగీతం అందించనున్నారు. ఇలా ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రామాయణం సుమారు రూ.4000 కోట్లకు పైగా భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్నారు.

Ramayana Movie Vijay Sethupathi Joins as Vibhishana Yash vs Sethupathi Face-Off Raises Expectations

తాజా సమాచారం ప్రకారం, ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో దక్షిణ భారత దేశపు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)చేరినట్టు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో రావణుడి సోదరుడు విభీషణుడు పాత్రలో కనిపించనున్నారు. ఇది సాధారణ సహాయక పాత్ర కాదు.. ధర్మం, నీతి, కుటుంబ బంధాల మధ్య నలిగిపోయే ఒక గొప్ప వ్యక్తిత్వం. అన్న అయిన రావణుడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడని గ్రహించి, అతడిని ఎదిరించి రాముడికి అండగా నిలబడే విభీషణుడి అంతర్మథనాన్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే అసాధారణ నటన అవసరం. 'కళ్లతోనే భావాలు పలికించే నటుడు'గా పేరున్న విజయ్ సేతుపతి ఈ పాత్రకు ప్రత్యేకమైన లోతు తీసుకొస్తారని చిత్రబృందం నమ్ముతోంది.

ఈ సినిమాలో రావణుడిగా యష్ (Yash) నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ. దీంతో వెండితెరపై అన్నదమ్ములుగా యష్ - విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. అహంకారంతో విర్రవీగే అన్నకు, ధర్మం కోసం నిలబడే తమ్ముడికి మధ్య జరిగే డైలాగ్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇందులో విభీషణుడి పాత్ర రెండో, మూడో భాగాల్లో అత్యంత కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి గతంలో కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రల్లోనూ తన సత్తా చాటారు. సహజ నటన, విలక్షణమైన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ విభీషణుడి పాత్రకు సరిగ్గా సరిపోతాయని దర్శకుడు భావించినట్లు సమాచారం. అందుకే ఈ కీలక పాత్రను ఆయనకు అప్పగించారనే టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్, అగ్ర తారలు, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ రామాయణం ఇప్పుడు కేవలం పౌరాణిక సినిమా కాకుండా నటనకు వేదికగా మారే మెగా సినీ ఈవెంట్ గా మారుతోంది. రిలీజ్‌కు దగ్గరపడే కొద్దీ ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చూడని స్థాయిలో ఒక మహా దృశ్య కావ్యం సిద్ధమవుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X