twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి రామ్ చరణ్ వద్ద రామాయణ ప్రస్తావన.. ఆయన రియాక్షన్ ఏంటంటే..?

    |

    బాహుబలి సినిమా తర్వాత మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు దర్శకనిర్మాతలు. బాహుబలి రాబట్టిన కలెక్షన్స్, సృష్టించిన కలెక్షన్ల సునామీ పెద్ద సినిమా నిర్మాతలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో 'రామాయణ' పేరుతో 1500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించేందుకు ఏకంగా ముగ్గురు బడా నిర్మాతలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.

    ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో రాముడు రోల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని సంప్రదించారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే అంశం మరోసారి ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

     Ramayana Rejected By Ram Charan..?

    'రామాయణ'లో రాముడిగా నటించాలని ఈ చిత్ర నిర్మాతలు రామ్ చరణ్ వద్ద ప్రస్తావించారట. కానీ ఆయన తన తన ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్టులో నటించలేనని చెప్పేశాడట. దీంతో 'రామాయణ'లో రాముడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. మరోవైపు రామ్ చరణ్ RRR ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. అలాగే 'సైరా నరసింహా రెడ్డి' నిర్మాణ పనుల్లో భాగమవుతున్నారు.

    భారీ ఎత్తున రామాయణ చిత్రాన్ని మూడు పార్టులుగా రూపొందించ బోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 3D వర్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్రంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని భాషలకు చెందిన నటీనటులు భాగం కానున్నారు. అతిత్వరలో ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.

    English summary
    Mythological epic Ramayana movie officially announced. The makers have set aside a budget of about Rs 500 crores for the same and now, they have roped in Nitesh Tiwari of Dangal fame and Ravi Udyawar of Mom in the project which will be made and released in Hindi, Tamil and Telugu languages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X