Ramayana Release Date: సాయి పల్లవి ‘రామాయణ' రిలీజ్ డేట్ ఇదేనా? మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..

Ramayana Release Date: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ (Ramayana). ఈ మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రమిది. ఈ మైథాలజికల్ విజువల్ వండర్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇండియన్ బాక్సాఫీస్ గేమ్‌ ను పూర్తిగా మార్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

రామాయణ మొదట భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబడిన మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ రిలీజ్ ప్లాన్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం, ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ఒక వారం ముందుగానే థియేటర్లలోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది, ఈ వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.

Ramayana Release Date Twist Ranbir Kapoor Sai Pallavi Film Likely to Arrive Before Diwali 2026

ఈ ముందస్తు విడుదల వెనుక ఒక భారీ బాక్సాఫీస్ స్ట్రాటజీ ఉందని విశ్లేషకులు అందించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా దీపావళి పండగకు ముందే సినిమా రిలీజ్ చేయడం ద్వారా మొదటి వారం మౌత్ టాక్‌ పాజిటివ్ గా వస్తే.. దీపావళి సెలవుల సమయంలో రెండో వారం కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండు వారాల పాటు మ్యాక్సిమమ్ బాక్సాఫీస్ వసూళ్లు సాధించడానికి మాస్టర్ ప్లాన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఒక ముఖ్య కారణం పోటీ.. నవంబర్ మొదటి వారంలో హాలీవుడ్, పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ సినిమాలతో పోటీ పడటం కంటే ముందే థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి రెండు వారాలు అత్యంత కీలకం. అందుకే రిలీజ్ టైమింగ్ పై జాగ్రత్తగా ప్లాన్ ఉంటుంది.

ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు, యశ్ పవర్‌ఫుల్ విలన్‌గా రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి సీత పాత్రలో నటించడం ఈ సినిమాకి మరో హైలైట్. ఇప్పటికే రణబీర్, యశ్ లుక్స్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. త్వరలోనే సాయి పల్లవి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

సాయి పల్లవి విషయానికి వస్తే, బాలీవుడ్‌లో ఆమెకు ఇది ఒక కీలక చిత్రమిది. 'ఏక్ దిన్' సినిమా ఫెయిల్యూర్ తర్వాత, ఈ 'రామాయణ'తో భారీ కమ్‌బ్యాక్ అవ్వాలని ఆమె భావిస్తోంది. సీత పాత్రలో ఆమె నటన ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. తనకు ఈ పాత్ర చాలా ప్రత్యేకమని, ఇది తన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక డైరెక్టర్ నితేష్ తివారి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్-అన్నీ కలిసి ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా IMAX ఫార్మాట్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి భావించడం, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఇలా 'రామాయణ' సినిమా కేవలం ఒక మైథాలజికల్ మూవీ మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే మూమెంట్. ఇక అక్టోబర్ 30 విడుదల నిజమైతే, దీపావళి సీజన్‌లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X