'రామయ్యా వస్తావయ్యా' రిలీజ్ పై రూమర్
హైదరాబాద్ :ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్ హీరోయిన్స్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. సినిమాని వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అభిమానులంతా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపధ్యంలో చిత్రం అనుకున్న తేదీకి విడుదల కాకపోయే అవకాశాలున్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
విడుదల డిలేకి వారు కారణం చెప్తూ... పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవుతోందని, ముఖ్యంగా రీ రికార్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదని అంటున్నారు. ఎనిమిది నుంచి పది రోజులు దాకా రీ రికార్డింగ్ కి సమయం పడుతుందని, ఇంకా తమన్ ప్రారంభించలేదని, అప్పటికీ రి రికార్డింగ్ పూర్తైనా, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉందని అంటన్నారు. ఇదే నిజమైతే దసరా ఫెస్టివల్ కు రామయ్య రావటం కష్టమేనని ఈ రూమర్ సారాంసం. అయితే హరీష్ శంకర్...పని రాక్షసుడు కాబట్టి అలాంటి సమస్య ఈ సినిమాకు రాకపోవచ్చు అనేది కొందరి వాదన. మరో ప్రక్క చిత్రం అక్టోబర్ 4న సెన్సార్ కి పంపుతారని అంటున్నారు.
'రామయ్యా వస్తావయ్యా' టైటిల్‌లో సాఫ్ట్‌నెస్. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగుల్లో రఫ్‌నెస్. కథాపరంగా ఎన్టీఆర్ యువజన నాయకుడని సమాచారం. లుక్ పరంగా మాత్రం చాక్లెట్‌బోయ్‌లా అనిపిస్తున్నాడు. భిన్నంగా గోచరిస్తున్న ఈ అంశాలన్నీ సినిమాపై ఓ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు దర్శకుడు హరీష్‌శంకర్. నిర్మాత 'దిల్'రాజు కూడా ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరో విషయం ఏంటంటే... ప్రేక్షకుల ఊహకందని ఓ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాలో ఉందని సమాచారం. దాన్ని దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచారని వినికిడి.
దిల్ రాజు మాట్లాడుతూ..... ''ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలతో సినిమా రూపొందింది. ఎన్టీఆర్ నటన, సమంత అందాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయి. శ్రుతిహాసన్ పాత్ర గత సినిమాల్లోకంటే వైవిధ్యంగా ఉండబోతోంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖ రామన్, రవిశంకర్, రావు రమేష్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications












