ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’టీజర్ డైలాగ్ ఇదే??
గతంలోనూ మిరపకాయ,గబ్బర్ సింగ్ చిత్రాల్లో హరీష్ శంకర్ డైలాగులు కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇదే స్పీడుతో ఎన్టీఆర్ కు కూడా ఫ్యాన్స్ పదే పదే చెప్పుకుని మురుసిపోయే డైలాగులు రాసాడంటున్నారు. అలాగే ఎన్టీఆర్ మోడ్రన్ లుక్‌లో గద పట్టుకుని ఉండటంతో సినిమా కాన్సెప్టు వెరైటీగా ఉంటుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయమై హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ... " మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ టైటిల్ కి ఫస్ట్ లుక్ కి వచ్చింది. నేను మిమ్మల్ని డిజప్పాయింట్ చేయను...యంగ్ టైగర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరోసారి ధాంక్స్ ." అన్నారు.
దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications












