రంభ ఒక కీలక పాత్రలో కృష్ణభగవాన్, రఘుబాబు హీరోలుగా దర్శకుడు రాజా వన్నెంరెడ్డి రూపొందించిన చిత్రం 'దొంగ సచ్చినోళ్లు'. ఫ్రారంభం రోజు నుంచీ ప్రధాన పాత్రలో చేస్తున్న రంభ టైటిలుకి తగ్గట్లు నీచంగా ఈ నిర్మాతలు బిహేవ్ చేస్తున్నారంటూ గొడవలు చేసింది. ఇది తెల్సిన కొంత మంది పెద్దలు భలే అవకాశం వచ్చిందని ఇంటర్ ఫియర్ అయ్యి మరీ రంభ దగ్గర మార్కులు కొట్టేద్దామని ప్రయత్నం చేసారు. కాని ఏమైందో ఏమో గాని ఆ అవకాశం వాళ్లకు రానివ్వలేదట. ఈలోగా ఏప్రిల్ 25న రిలీజంటూ డేటు ప్రకటించారు. "అంటే గుట్టుగా రంభతో గొడవ సెటిల్ చేసుకున్నారన్నమాట!" అని మొదట నుంచి సీరియల్లా ఫాలో అవుతున్న ఫిల్మ్ నగర్ వాసులు నిట్టూరుస్తున్నారు. జె. సాంబశివరావు, చల్లా సత్య వరప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇద్దరు మతిమరపు అన్నదమ్ముల కథగా నడిచే ఫుల్ కామెడీ ఎంటర్ టైనరట. ఇంతకీ ఈ సినిమా కథ లో కామెడి పండుతుందో లేదో కాని బయిట విశేషాలు మాత్రం కామెడీగా ఉంటున్నాయి.